మేషం : వ్యవహారాలలో పురోగతి లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
వృషభం : కుటుంబంలో సమస్యలు అధిగమిస్తారు. దైవచింతన. ముఖ్యమైన. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో మరింత పనిభారం.
మిథునం : కొత్త మిత్రుల పరిచయం.శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. పనుల్లో విజయం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది.
కర్కాటకం : సంఘంలో గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూలఫలితాలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. వ్యాపారాలు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
సింహం : పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కన్య : కొత్త రుణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు.. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
తుల : పలుకుబడి పెరుగుతుంది. కొత్త∙విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గందరగోళం నుంచి గట్టెక్కుతారు..
వృశ్చికం : వ్యవహారాలలో విజయం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి..
ధనుస్సు : ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మకరం : రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
కుంభం : వ్యవహారాలలో పురోగతి. భూములు, వాహనాలు సమకూరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరం. వాహనాలు కొనుగోలు చేస్తారు.
మీనం : పనుల్లో స్వల్ప అవాంతరాలు. రుణయత్నాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో పనిభారం..
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment