రచన:అది శంకరాచార్య
తెలుగు-Rajyalakshmi srinivas Boddupalli.
*దిగంబరం భస్మసుగన్ధలేపనం*
*చక్రం త్రిశూలం డమరుం గదాం చ* ।
*పద్మాసనస్థం ఋషిదేవవన్దితం*
*దత్తాత్రేయధ్యానమభీష్టసిద్ధిదమ్* ॥ 1॥
భావం:: 1 :: దిగంబరులు, భస్మ, సుగంధములతో అలంకరించిన దేహము కలవాడు, చక్రం,త్రిశూలం, డమరుకం,గద, ధరించినవాడు,పద్మాసనంలో విరాజమానులై ఋషులు,దేవతలతో పూజింపబడుతున్న దత్తాత్రేయుని ధ్యానించువారి అభీష్టములు సిధ్ధించును.
*మూలాధారే వారిజపద్మే సచతుష్కే*
*వంశంషంసం వర్ణవిశాలైః సువిశాలైః* ।
*రక్తం వర్ణం శ్రీభగవతం గణనాథం*
*దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి* ॥ 2॥
భావం:: 2 మూలాధారచక్రస్థానం లో నాలుగు దళములు వున్న పద్మం వుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము లకు సంకేతం. చిక్కటి ఎరుపు వర్ణం తో కూడివున్న ఆ దళాలపై వం, శం, షం, సం అనే బీజాక్షరాలు వుంటాయి. దీనికి భగవంతుడు (అధిష్ఠాన దేవత) గణనాథుడు. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించుచున్నాను.
*స్వాధిష్ఠానే షట్దలపద్మే తనులింగే*
*బాలాన్తైస్తద్వర్ణవిశాలైః సువిశాలైః* ।
*పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం*
*దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి* ॥ ౩॥
భావము:: 3 స్వాధిష్టానచక్రం ( లింగమూలమున వుండు) ఆరు దళములు కలిగిన పద్మము వలె వుండి, అగ్ని తత్వం కలది. సింధూర వర్ణం కల ఈ పద్మం మీద బం, భం, యం,యం,రం , లం, అక్షరాలు వుంటాయి. దీని అధిపతి బ్రహ్మ. వాహనం మొసలి. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
*నాభౌ పద్మే పత్రదశాంకే డఫవర్ణే*
*లక్ష్మీకాన్తం గరూఢారూఢం మణిపూరే* ।
*నీలవర్ణం నిర్గుణరూపం నిగమాక్షం*
*దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి* ॥ 4//
భావము:: 4 మణిపూరక చక్రం బొడ్డు మూలములో పది దళములతో కూడిన పద్మము లాగా వుండును. బీజాక్షరాలు డ,ఢ,ణ,త,థ ద,ధ,న,ప,ఫ లిఖించబడి యుండును. అధిపతి లక్ష్మీకాంతుడు ( విష్ణువు). మణిపూరక మందున్న మేఘం నిలవర్ణము కలది, నిర్గుణ రూపం కలది, అంధకారమును పోగొట్టు మెరుపు లాంటిది. శ్రీగురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
*హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠవర్ణే*
*అనాహతాంతే వృషభారూఢం శివరూపమ్* ।
*సర్గస్థిత్యంతాం కుర్వాణం ధవలాంగం*
*దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి* !!5॥
భావము:: 5 హృదయము వెనుక విలసిల్లే ఈ చక్రం పన్నెండు దళములు కల పద్మము వలె వుండును. క,ఖ,గ,ఘ,ఙ,చ,ఛ,జ,ఝ,ఞ,ట,ఠ అను అక్షరములు కలది. అనాహత (తగలకుండా వచ్చే శబ్దం) చక్రమునకు అధిదేవత సృష్టి స్థితి లయ కారకుడు, ధవల వర్ణము కలవాడు, వృషభ వాహనుడైన శివుడు. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
*కంఠస్థానే చక్రవిశుద్ధే కమలాన్తే*
*చంద్రాకారే షోడశపత్రే స్వరవర్ణే*
*మాయాధీశం జీవశివం తం భగవంతం*
*దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి* ॥ 6॥
భావము:: 6 విశుద్ధ చక్రం ( పవిత్రము చేయునది) కంఠస్థానంలో వెనుక పదహారు దళములతో కూడిన శ్వేత వర్ణ కమలమ వలె వుండును. అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ ,ఋ,ౠ,ఎ,ఏ,ఐ ,ఒ ,ఓ,ఔ,అం, అః అక్షరాలు వుండును. ఇది చంద్రుని ఆకారము లో వుండును. పదహారు అక్షరాలు చంద్రుని పదహారు కళలకు, శుద్ధ చైతన్యమునకు సంకేతము. దీని అధిపతి మాయాధీశుడైన శివుడు.శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
*ఆజ్ఞాచక్రే భృకుటిస్థానే ద్విదలాన్తే*
*హం క్షం బీజం జ్ఞానసముద్రం గురూమూర్తిం*
*విద్యుత్వర్ణం జ్ఞానమయం తం నిటిలాక్షం*
*దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి* ॥ 7॥
భావము:: 7 ఆజ్ఞాచక్రం భృకుటి స్థానంలో రెండు దళములతో కూడిన పద్మము వలె వుండును. హం , క్షం అను బీజాక్షరాలు వుండును. దీనినే జ్ఞానచక్షువు అంటారు. ఈ చక్రమును సాధన చేస్తే, ఆత్మ దర్శనం అయి బ్రహ్మ జ్ఞాని అవుతాడు. ప్రకాశవంతమైన వర్ణముతో, జ్ఞానమయుడు, త్రినేత్రుడు, అయిన సదాశివుడు దీనికి అధిపతి. శ్రీ గురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
*మూర్ధ్నిస్థానే వారిజపద్మే శశిబీజం*
*శుభ్రం వర్ణం పత్రసహస్రే లలనాఖ్యే*
*హం బీజాఖ్యం వర్ణసహస్రం తూర్యాంతం*
*దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి* ॥ 8॥
భావము::-8 కపాల౦ పై బాగంలో (బ్రహ్మారంధ్రం అని కూడా అంటారు ) ఓం కారంతో వేయి దళముల పద్మము లాగా వుండును. ప్రకాశించు తెల్లని రంగులో సకల వర్ణములు కలిగి వుండును. హం బీజాక్షరాలు తో వుండును.ఆత్మజ్ఞానం సాధించిన పరమహంసలు పొందేస్థితి. పరిపూర్ణ జ్ఞానమునకు ప్రతీక. అద్వైత స్థితి. శ్రీ గురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
*బ్రహ్మానన్దం బ్రహ్మముకున్దం భగవన్తం*
*బ్రహ్మజ్ఞానం జ్ఞానమయం తం స్వయమేవ*
*పరమాత్మానం బ్రహ్మమునీద్రం భసితాఙ్గం*
*దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి* ॥ 9॥
భావం:: 9 బ్రహ్మానందము ప్రసాదించువాడు, బ్రహ్మముకుందుడు, భగవంతుడు, బ్రహ్మజ్ఞాని మరియు జ్ఞానమయుడు, నిర్గుణ శుద్ధ చైతన్య ముతో ప్రకాశించుచూ స్వయంగా పరమాత్మ అయిన వాడు, బ్రహ్మ మునీంద్రుడు, ప్రకాశమానమైన అంగములు కలవాడు, శ్రీగురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
ఇతి శ్రీమద్శఙ్కరాచార్యవిరచితం శ్రీదత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రం సమ్పూర్ణమ్ ।
All copy rights to J .Sita lakshmi amma garu.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment