Monday, 14 December 2020

రుద్రాక్షలు- వాటిని ఎలా ధరించాలి?- ఫలితాలు?

 


రుద్రాక్ష అంటే :- రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని 

స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల 

(కన్నుల) నుండి జాలువారిన నీటి బిందువులు 

భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా 

మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన 

కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం

 నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు,

 మునులు, దేవతలు, రాక్షసులు అందరూ 

వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా 

తెలియుచున్నది. ఇప్పటికీ వేదాంతులు, 

గురువులు, పూజారులు లాంటివారు వీటిని 

ధరిస్తారు. కొంతమంది వీటిని ధరించుట 

వీలుకాని నియమ నిబంధనలను పాటించనివారు 

పూజా గృహముల యందు ఉంచి పూజించుట 

గమనిస్తూనే ఉన్నాం.

రుద్రాక్షలు :- రుద్రాక్షలలో పలు రకాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన అడవులలో 

మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు బాదంకాయ లాగ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుదించుకుని గుండ్రముగా మారుతాయి. దీని మధ్య భాగమున గల తొడిమ ఎండి రాలిపోతుంది.

 అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య కాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు 

కలుగుతుంది.

రుద్రాక్షలు రకాలు :- వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యా పరంగా విభజిస్తారు. 

ఒక ముఖము నుండి ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. ఎక్కడైనా 

అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన 

రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెప్పబడినది. 

దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని చెబుతారు. రుద్రాక్షల

 వివరాలు క్రింది తెలియజేయబడినవి.

ఏకముఖి ( ఒక ముఖము కలిగినది ) :- అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, 

ఓంకార రూపంగా నమ్ముతారు. ఈ రుద్రాక్ష చాలా విలువైనది. ఎటువంటి మంత్ర, 

తంత్ర ప్రయోగాలనైనా తిప్పి కొట్టె శక్తిగలదు. సిరి సంపదలు, శిరో సంబంధ రోగములు నివారణ అగును

ద్విముఖి ( రెండు ముఖములు కలిగినది ) :- దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు.

 ఇది బ్రహ్మ రుద్రాక్ష అని కొందరి అభిప్రాయం. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని 

కూడా అనుకోవచ్చు. సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధికల్గును. మనో

వ్యాకులతను దూరం చేస్తుంది.

త్రిముఖి ( మూడు ముఖములు కలిగినది ) :- దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. 

ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమయినది. ధనధాన్యసమృద్ధి, కామెర్ల వ్యాధి నివారణ మరియు సర్పదోష నివారణ అగును.

చతుర్ముఖి ( నాలుగు ముఖాలు కలిగినవది ) :- నాలుగు వేదాల స్వరూపం. 

పరిశోధకులు, జ్యోతిర్గణిత వేత్తలు ధరించడం వల్ల అధికరాణింపు ఉండును 

మరియు ఏకాగ్రత పెరుగును.

పంచముఖి ( అయిదు ముఖాలు కలిగినది ) :- పంచభూత స్వరూపం. బ్రహ్మ స్వరూపమయిన ఈ రుద్రాక్ష వల్ల అకాలమృత్యునివారణ, గుండెపోటు వంటి 

హృద్రోగ సంబంధిత వ్యాధులు నివారణ అగును మరియు మలబద్దకం నివారణ

 అగును.

షణ్ముఖి ( ఆరు ముఖములు కలది ) :- కార్తీకేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియాను పోగోడుతుంది. ఈ రుద్రాక్ష కుమారస్వామి స్వరూపం, శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభించును.

సప్తముఖి ( ఏడు ముఖాలు కలిగినది ) :- కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం. సభావశ్యత, సంపద, కీర్తి , ఉత్తేజం కల్గును.

అష్టముఖి ( ఎనిమిది ముఖాలు కలిగినది ) :- విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ 

శక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కల్గును.

నవముఖి ( తొమ్మిది ముఖాలు కలది ) :- నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక.

 దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి. రాజకీయ పదవులలో ఔన్నత్యం ఆశించువారికి, అపమృత్యు నివారణకు, పరోపకార దక్షులకు ధరించవచ్చు.

దశముఖి ( పది ముఖాలు కలిగినది ) :- దశావతార స్వరూపం. 

శ్రీ మన్నారాయణుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం

 కలుగుతుంది. గొంతు సంబంధ రోగాలను, నవగ్రహముల ద్వారా కలుగు

 కష్టములు, సమస్యలు నివారణ అగును.

 ఏకాదశముఖి ( పదకొండు ముఖాలు కలిగినది ) :- ఇది శివాత్మకమైన 

రుద్రాక్ష. వైవాహిక జీవితంలో ఆనందమునకు, గర్భ సంబంధ రోగాలకు 

అనుకూలత లభించును. 

పూజ ( దీక్ష )లలో వినియోగించే రుద్రాక్ష మాల సంఖ్య :- రుద్రాక్షలను 

108 గాని, 54 గాని, 27 గాని బంగారము, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారుచేయించి శాస్త్రోక్తంగా విధి విధానాలతో పూజ జరిపించి నిర్ణీతమైన ముహూర్తంలో మెడలో ధరించవలెను. వీటిని జప మాలగా కూడా ఉపయోగించవచ్చును. 

వైద్యంలో రుద్రాక్షలు:- రుద్రాక్షలు ధరించుట వలన గుండె జబ్బులు, 

అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అందరూ ధరించవచ్చును.

 వ్యాపారంలో రుద్రాక్షలు :- మనదేశంలో ప్రతీ సంవత్సరమూ 300 కోట్ల 
రుద్రాక్షల వ్యాపారం జరుగుతుందని హీలింగ్ మాట్రిక్స్ అనే సంస్థ
 7 జూలై 2011 నాడు తెలిపింది. స్మగ్లర్లు నకిలీ రుద్రాక్ష మాలలు ఎర్ర చందనం దుంగలనుండి తయారు చేస్తారు. ఇంకా కొంతమంది మోసగాళ్ళు రేగుపండ్లలోని గింజలకు రంగులు అద్ది రుద్రాక్ష అని అమాయక జనాలకు అంటగడతారు. 
మరి కొంత మందైతే చెక్క పొత్తుతో రుద్రాక్ష ఆకారంలో మౌల్ద్ చేసి రంగులు 
వేసి ఏకముఖి లేదా ముఖ్యంగా మార్కెట్ లో వేటిని డిమాండ్ ఎక్కువగా 
ఉన్నాయో వాటిని నకిలీవి తయారు మోసగిస్తున్నారు. అందుకే ఎక్కడ పడితే
 అక్కడ కొనకూడదు.


రుద్రాక్ష - మీరు తెలుసుకోవలసిన విషయాలు


రుద్రాక్ష అనేది ఒక రకమైన చెట్టు జాతి యొక్క విత్తనం. సహజంగా ఎత్తైన పర్వతాలలో ముఖ్యంగా హిమాలయాల ప్రాంతంలో పెరుగుతాయి. ఇవి దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలలో కొన్ని ఉన్నాయి. కానీ నాణ్యత కలవి ఎత్తైన హిమాలయ ప్రాంతం లోనే లభిస్తాయి ఎందుకంటే భూమి, వాతావరణం లాంటి వివిధ కారణాల ప్రభావం చేత. ఈ విత్తనాలకి ఒక విశిష్టమైన కదలిక ఉంటుంది. సహజంగా పెద్ద విత్తనాలలో అంతగా కదలిక ఉండదు. విత్తనం ఎంత చిన్నదైతే కదలిక అంత బాగా ఉంటుంది.

మీరు చన్నీటి స్నానం చేస్తూ ఏ రకమైన రసాయన సబ్బు వాడకుండా ,ఆ నీరు రుద్రాక్ష మాలను మరియు మీ శరీరాన్ని తడుపుతూ ఉంటె చాలా మంచిది.: 

మాలలు (లేక) దండలు

సహజంగా ఈ విత్తనాలు అన్ని కూర్చి ఒక దండ లాగా చేస్తారు సాంప్రదాయకంగా ఒక రుద్రాక్ష మాలలో 108 పూసలు కంటే ఒకటి ఎక్కువ గా ఉండాలని భావిస్తారు. ఆ ఒకటి ఎక్కువ ఉన్న రుద్రాక్షయే బిందువు. ప్రతి రుద్రాక్ష మాలకి ఖచ్చితంగా బిందువు ఉండాలి లేని పక్షం లో ఆ శక్తి చక్రంలా తయారవుతుంది. దీనివలన సున్నితమైన మనుషులకి మానసిక స్తిరత్వం తగ్గే ఆస్కారం ఉంది. మీరు చన్నీటి స్నానం చేస్తూ ఏ రకమైన రసాయన సబ్బు వాడకుండా, ఆ నీరు రుద్రాక్ష మాలను మరియు మీ శరీరాన్ని తడుపుతూ ఉంటె చాలా మంచిది. ఈ రుద్రాక్ష మాలను సిల్క్ దారం లేక ప్రత్తి దారం తో చేస్తే మంచిది. మీరు ఈ మాలను దారం తో ధరిస్తే ప్రతి 6 నెలలకి ఆ దారాన్ని మార్చే ప్రయత్నం చేయటం మంచిది. లేదంటే ఏదో ఒక రోజు ఆ మాల ఆకస్మికంగా తెగిపోయి 108పూసలు చిందరవందర అవుతాయి. మీరు రాగి,వెండి మరియు బంగారం ఉపయోగించిన మంచిదే కాని, ఎక్కువ సందర్భాలలో మీరు ఆ మాలను తయారికి స్వర్ణ కారుడి దగ్గరికి తీసుకు వెళ్తారు. ఎప్పుడైతే ఆ స్వర్ణకారుడు బంగారపు దారం తో గట్టిగా ముడి వేస్తె ఆ రుద్రాక్ష యొక్క లోపలి బాగం పగులుతుంది.

వ్యక్తులని స్వర్ణకారులకి చెప్పమని నేను చెబుతున్నప్పటికీ, అది పూర్తి అయ్యి నా దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు 30 - 40 శాతం సమయాల్లో అవి పగిలే ఉండటం నేను చూస్తున్నాను. వదులుగా ఉండేటట్టు చూసుకోవటం చాలా ముఖ్యం. ఎక్కువ బిగుతుగా ఉండకూడదు, ఒత్తిడి వల్ల లోపల పగుళ్ళు ఏర్పడితే అస్సలు మంచిది కాదు. ఈ మాలను ఎల్లప్పుడ్డు ధరించే ఉండవచ్చు. మీరు స్నానం చేసేటప్పుడు కూడా ధరించవచ్చు మీరు చన్నీటి స్నానం చేస్తూ ఏ రకమైన రసాయన సబ్బు వాడకుండా, ఆ నీరు రుద్రాక్ష మాలను మరియు మీ శరీరాన్ని తడుపుతూ ఉంటె చాలా మంచిది. మీరు వేడి నీటితో స్నానం చేస్తూ మరియు రసాయనాల సబ్బు వాడితే కొన్ని రోజుల తరువాత ఆ మాల పెళుసు గా మారి పగులుతుంది, అటువంటి సమయాల్లో మాలను దరించకుండా ఉంటె మంచిది.

ఉపయోగాలు

ఎవరైతే ఎప్పుడూ సంచరిస్తూ వివిధ ప్రాంతాల్లో తింటూ నిద్ర పోతారో, రుద్రాక్ష అనేది మంచి మద్దతు, ఎందుకంటే మీ శక్తి ని ఒక చట్రం లాగా చేస్తుంది. మీరు గమనించే ఉంటారు కొత్త ప్రదేశాల్లో మీకు అంత త్వరగా నిద్ర పట్టదు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో మీరు శారీరకంగా అలసిపోయినప్పటికీ నిద్ర రాదు. ఎందువలన అంటే మీరు ఉన్న పరిస్తితి మీ శక్తికి సహాయకారిగా లేకపోవటం చేత, మిమ్మల్నిఅంత తొందరగా స్తిమిత పడనివ్వదు. సాధువలు మరియు సన్యాసులని ప్రాంతాలు మరియు పరిస్థితులు ఇబ్బంది పెట్టవచ్చు ఎందుకంటే వారు నిరంతరం సంచరిస్తూనే ఉంటారు. వారికి ఒక నియమం ఉంది ఏమిటంటే ఒకే స్తలం లో రెండు సార్లు తల కింద పెట్టకూడదు అని. ఈ రోజుల్లో మనుషులు మళ్లి వాళ్ళ వృత్తి ,వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో తింటూ నిద్ర పోతూ ఉన్నారు,కావున రుద్రాక్ష చాల ఉపయోగ కారి.

రుద్రాక్షని నీటికి కొంచం ఎత్తులో ఉంచితే ఆ నీరు మంచివి మరియు త్రాగదగినవి అయితే సవ్య దశలో తిరుగుతుంది. : 

ఇంకొక విషయం ఏమిటంటే అడవుల్లో నివసించే సాధువులు సన్యాసులు ఏ కొలనులో పడితే ఆ కొలనులో నీరు త్రాగరు. ఎందుకంటే ప్రకృతిలోని వివిధ వాయువుల చేత ఆ నీరు విషపూరితంగా కలుషితం అవుతుంది. వారు ఆ నీరుని త్రాగాల్సి వస్తే అస్వస్థతకు గురి కావచ్చు లేక మరణించవచ్చు. రుద్రాక్షని నీటికి కొంచం ఎత్తులో ఉంచితే ఆ నీరు మంచివి మరియు త్రాగదగినవి అయితే సవ్య(clockwise) దశలో తిరుగుతుంది. ఆ నీరు విషపూరితమైతే అపసవ్య(anti-clockwise) దిశలో తిరుగుతుంది. ఏదైనా సానుకూల ప్రాణ పదార్ధం పై ఉంచితే సవ్య దిశలో తిరుగుతుంది. ప్రతికూల ప్రాణ పదార్దం పై ఉంచితే అపసవ్య దిశలో తిరుగుతుంది.

ప్రతికూల శక్తులపై కవచం

ఇది ప్రతికూల శక్తుల పై ఒక రకమైన కవచం లాగా ఉంటుంది. కొంతమంది ప్రతికూల శక్తులతో ఇతరులకి హాని చేసే అవకాశ o ఉంది. ఇది ప్రతికూల శక్తుల పై ఒక రకమైన కవచం లాగా ఉంటుంది. ఇది దానికంటతదే ఒక మొత్తం శాస్త్రం. అథర్వణ వేదం అనే వేదం మొత్తం, శక్తులని ఒకరికి లాభానికి ఇంకొకరి నష్టానికి ఎలా వాడొచ్చో ఉంటుంది. ఎవరైతే దీని పై పట్టు సాదించి ఉపయోగిస్తారో ,చాలా విషయాలు - విపరీతమైన బాధ మరియు మరణo కూడా సంభవించే అవకాశం ఉంది.

మీకై మీకే చాలా ముఖాలు,అన్ని ముఖాలు పెట్టుకుని మీరు ఏఖముఖిని ధరిస్తే సమస్యని అడిగి తెచ్చుకున్నటే. :

రుద్రాక్ష వీటన్నిటిపై ఒక రకమైన కవచం. మీరు అనుకోవచ్చు ఎవరూ నా పైన ప్రతికూల పనులు చెయ్యరు అని, మీరే లక్ష్యం గా ఉండాల్సిన అవసరం లేదు. మీ ప్రక్కన ఉన్నవారి పైన ప్రయోగిస్తున్నారు అనుకుందాం. అది మీకు కూడా జరగ వచ్చు ఎందుకంటే మీరు ఆ వ్యక్తి ప్రక్కన ఉన్నారు. అది ఎలాంటిది అంటే వీదీలో ఇద్దరు గురిపెట్టి కాల్చుకుంటే మిమ్మల్ని కాల్చే ఉద్దేశం లేనప్పటికీ మీకు తగల వచ్చు. అలానే ఇటువంటి విషయాలూ జరుగుతాయి. మీరు లక్ష్యం కానప్పటికీ మీరు ప్రతికూల సమయంలో ప్రతికూల ప్రదేశం లో ఉంటె అది మీకు కూడా జరగ వచ్చు. ఇటువంటి విషయాల పై ఎక్కువ భయం ఉండాల్సిన అవసరం లేదు, కాని మాల ఇటువంటి వాటి నుండి ఒక రకమైన రక్షణ.

ఏకముఖి,పంచముఖి మరికొన్ని..

ఒక పూసకి 1 నుండి 21 ముఖాలు ఉండొచ్చు. అవి వివిధ రకాల ప్రయోజనాలకి ఉపయోగిస్తారు, ఊరికే దుకాణం లో కొని శరీరం పైన ఉంచుకోవటం అంత మంచిది కాదు. సరిఅయినది కాకపోతే జీవితాన్ని అస్తవ్యస్తం చేయవచ్చు. చాలా మంది ఎకముఖిని ధరించాలని అనుకుంటారు, ఒకే ముఖం ఎందుకంటే అది చాలా శక్తివంతం. మీకై మీకే చాలా ముఖాలు,అన్ని ముఖాలు పెట్టుకుని మీరు ఏఖముఖిని ధరిస్తే సమస్యని అడిగి తెచ్చుకున్నటే.

పంచముఖి సురక్షితం మరియు అందరికి మంచిది -పురుషులు ,స్త్రీలు ,పిల్లలు అందరికి. జనం అంటూ ఉంటారు మీరు ఏకముఖిని ధరిస్తే 12 రోజుల్లో మీరు మీ కుటుంబాన్ని వదిలిపెడతారు అని. మీరు మీ కుటుంబాన్ని వదిలేస్తారా లేదా అన్నది సమస్య కాదు. అవి కేవలం మీ శక్తులు మీరు ఏకాంతం కోరుకునేటట్టు చేస్తాయి ఇది ఇతరలుతో అనుకూలంగా ఉండనివ్వదు. మీరు వేరే రకాల రుద్రాక్షలను ధరించాలి అనుకుంటే , ఊరికే కొనుక్కొని మీ వ్యవస్థ పై పెట్టుకోకుండా వాటి గురించి బాగా తెలిసిన వారి నుండి స్వీకరించటం మంచిది. పంచముఖి సురక్షితం మరియు అందరికి మంచిది - పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరికి. ఇది మీ సాధారణ శ్రేయస్సుకి ఆరోగ్యానికి మరియు మీ స్వేచ్చకి ఎంతో మంచిది. ఇది మీ రక్తపోటును తగ్గిస్తుంది. మీ నరాలకు స్వాంతను చేకుర్చి ఒక రకమైన ప్రశాoతతను చురుకుదన్నాని మీ నాడి వ్యవస్తకు కలిగిస్తాయి. 12 వయస్సు లోపు పిల్లలు 6 ముఖాల రుద్రాక్ష ధరించవచ్చు. అది వారి ప్రశాంతతకు శ్రద్ధ కు ఉపయోగకారిగా ఉంటుంది. వీటన్నిటికి మించి వారు పెద్దల నుండి సరిఅయిన శ్రద్ధను స్వీకరిస్తారు.

గౌరిశంకర్ మీ ఇడ, పింగాళలను సమతుల్యం చేసి క్రియాశీలం చేస్తాయి:

గౌరీశంకర్ అనేది మీ ఇడ, పింగాళలను సమతుల్యం చేసే రకం. సహజంగా ఇది సౌభగ్యాన్ని కలిగిస్తుంది అని ప్రజలు నమ్ముతారు. సౌభగ్యాo అంటే కేవలం డబ్బే కానవసరం లేదు అది ఎన్నో రకాలుగా రావొచ్చు. మీకు ఏది స్వంతం కానప్పటికీ మీ జీవితం లో సౌభాగ్యాన్ని పొందవచ్చు. మీరు సమతుల్యం లేక స్తిమితం గా ఉండే వ్యక్తి అయి ఉండి ,మీ జీవితం లో సున్నితంగా పని చేస్తూ ఉంటె మీకు సౌభాగ్యం రావొచ్చు. మీ శక్తులు బాగా పని చేస్తుంటే అది జరుగుతుంది. గౌరిశంకర్ మీఇడ, పింగాళలను సమతుల్యం చేసి క్రియాశీలం చేస్తాయి.

వాస్తవమైన (లేక) నిజమైన మాలలు

సాంప్రదాయంగా రుద్రాక్షల వ్యవహారం చూసే వ్యక్తులు దానిని వారి జీవితంలో ఒక పవిత్ర విదిగా భావిస్తారు. తరతరాలుగా వారు ఇది ఒక్కటే చేస్తున్నారు. వాటి నుండి జీవనోపాధి పొందినప్పటికి. ప్రాధమికంగా వారికీ ఇతరులకు సమర్పణ చేసేటటువంటి ఒక పవిత్ర విధి. ఎప్పుడైతే గిరాకీ ఎక్కువగా ఉంటుందో ఆర్థిక కార్యకలాపాలు మొదలుఅవుతయి. ఇప్పుడు ఈ రోజుల్లో భద్రాక్ష అనే ఒక రకమైన విత్తనం వచ్చింది. ఇది విషపూరితం ఇది ఎక్కువగా బీహార్ ,ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలలో పెరుగుతుంది. చూడటానికి ఈ రెండు విత్తనాలు ఒకే రకంగా ఉంటాయి మీరు తేడా గమనిoచలేరు. మీరు సున్నితంగా ఉండి మీ చేతిలోకి తీసుకుంటేనే తేడా గమనించ గలరు. దానిని శరీరం పైన ధరించ కూడదు కానీ చాలా ప్రదేశాలలో వీటిని నిజమైనవి గా అమ్ముతున్నారు. కావున మీరు నమ్మకమైన వారి  నుండి మాలను స్వీకరించటం చాలా ముఖ్యం

నక్షత్రము ధరించవలసిన రుద్రాక్ష

అశ్వని - నవముఖి 

భరణి - షణ్ముఖి 

కృత్తిక - ఏకముఖి, ద్వాదశముఖి

 రోహిణి - ద్విముఖి 

మృగశిర - త్రిముఖి

 ఆరుద్ర - అష్టముఖి 

పునర్వసు - పంచముఖి 

పుష్యమి - సప్తముఖి 

ఆశ్లేష - చతుర్ముఖి 

మఖ - నవముఖి 

పుబ్బ - షణ్ముఖి 

ఉత్తర - ఏకముఖి, ద్వాదశముఖి 

హస్త - ద్విముఖి 

చిత్త - త్రిముఖి 

స్వాతి - అష్టముఖి 

విశాఖ - పంచముఖి 

అనురాధ - సప్తముఖి 

జ్యేష్ఠ - చతుర్ముఖి 

మూల - నవముఖి 

పూర్వాషాఢ - షణ్ముఖి 

ఉత్తరాషాఢ - ఏకముఖి లేదా ద్వాదశముఖి 

శ్రవణం - ద్విముఖి 

ధనిష్ట - త్రిముఖి 

శతభిషం - అష్టముఖి 

పూర్వాభాద్ర - పంచముఖి 

ఉత్తరాభాద్ర - సప్తముఖి

 రేవతి - చతుర్ముఖి. 


రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రునికి ఏంతో ప్రీతికరమైనవి. రుద్రాక్షలు ధరించడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి.ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనైనవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులో నుంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా ఉంటారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెప్తున్నాయి.

ముఖ్య సూచన:- ఏ ముఖ రుద్రాక్షలు ధరించిన వారైనా సరే తప్పని సరిగా నియమ, నిబంధనలు పాటించవలయును, రుద్రాక్షలు ధరించి మధు, మాంసాహారం తీసుకో కూడదు. శుచి శుభ్రతలు పాటించాలి. ఇంద్రియనిగ్రహశక్తి ముఖ్య అవసరం. నిష్టాగా ఉండాలి, దాంపత్య అన్యోన్య సమయంలో రుద్రాక్షలు మేడలో ఉండరాదు. ఈ పద్దతులను ఎవరైతే ఆచారిస్తారో వారికే సత్ఫలితాలు కలుగుతాయి.


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment