Thursday, 10 December 2020

ఈ నెల 14న సూర్యగ్రహణం.. 12 రాశులపై ప్రతికూల ప్రభావం..!

 

https://www.facebook.com/vidhathaastornumerology


ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి ఖగోళ సంఘటన జరగనుంది. అదే సూర్యగ్రహణం. డిసెంబరు 14న ఏర్పడనుంది. చిలీ, అర్జెంటీనా, దక్షిణ అమెరిగా, నైరుతి ఆఫ్రికా, అంటార్కిటికా ప్రాంతాల ప్రజలు ఈ గ్రహణాన్ని వీక్షించే అవకాశముంది.

2020 సంవత్సరం అల్లకల్లోలంగా ఉంది. జ్యోతిష సంఘటనలు ఏడాది పొడవునా కొనసాగాయి. మేషం, బృహస్పతి, శని కలయిక, రాహువు-కేతువులతో పాటు నూతన రాశుల్లో చంద్రగ్రహణం, ఉపఛాయ చంద్రగ్రహణం సూర్యగ్రహణాలు ఏర్పడటం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి ఖగోళ సంఘటన జరగనుంది. అదే సూర్యగ్రహణం. డిసెంబరు 14న ఏర్పడనుంది. చిలీ, అర్జెంటీనా, దక్షిణ అమెరిగా, నైరుతి ఆఫ్రికా, అంటార్కిటికా ప్రాంతాల ప్రజలు ఈ గ్రహణాన్ని వీక్షించే అవకాశముంది. బొలివియా, పరాగ్వే, ఉరుగ్వే, భారత్, బ్రెజిల్, పెరూ, ఈక్వెడార్ దేశాల్లో ఈ సూర్యగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ గ్రహణం ప్రభావం రాశులపై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

​మేషం..

ఈ సూర్యగ్రహణం ప్రభావం వల్ల మేష రాశి వారు అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలైనన్ని ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారం, వ్యక్తిగత సమస్యలకు సంబంధించి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అదనపు ఇబ్బందులు వేధిస్తాయి. అనవసర కష్టాలకు కొని తెచ్చుకోకండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా లేకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది.

​వృషభం..

సూర్యగ్రహణం ప్రభావం వల్ల వృషభ రాశి వారు ఆరోగ్య సంబధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సమస్యలు బాధిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఈ సమయంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక లాభాల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టుకుండా ఉండేందుకు ప్రయత్నించండి. దీర్ఘకాలిక వ్యాధి ఈ సమయంలో సమస్యలను రెట్టింపు చేస్త్తుంది.

​మిథునం..

గ్రహణం ప్రభావం వల్ల మిథున రాశి వారికి నిరీక్షణ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అపార్థాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండండి. లేదంటే సంబంధాలు దెబ్బతింటాయి. ప్రొఫెషనల్ అంశం దగ్గరకొస్తే భాగస్వామ్య వ్యాపారంలో నష్టపోయే అవకాశముంది. అయితే పరస్ఫర అవగాహనతో సమస్యను పరిష్కరించుకోవడంలో సహాయపడతారు.

​కర్కాటకం..

ఈ సూర్యగ్రహణం సమయంలో కర్కాటక రాశి వారి కార్యాలయంలో వ్యక్తిగత జీవితంలో సహనంతో ఉండాలి. వాస్తవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి నిర్లక్ష్య వైఖరిని తీసుకోకపోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

​సింహం.

సూర్య గ్రహణం ప్రభావం వల్ల సింహ రాశి వారికి సంబంధాల విషయాల్లో తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకుంటే సామాజిక కుటుంబ ఇబ్బందికి దారితీస్తుంది. అంతేకాకుండా ఆదాయం కూడా ప్రభావితమవుతుంది. ఆర్థిక స్థిరత్వానికి సంబంధించి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. లేకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది.

​కన్య..

సూర్యగ్రహణం ప్రభావం వల్ల కుటుంబానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. పని ప్రదేశంలో మీ ప్రతిష్టను, పనితీరును కోనసాగించడానికి కృషి చేయాల్సి ఉంటుంది. బలమైన ప్రయత్నాలు అవసరం. లేకపోతే సమస్యలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి.

​తుల..

ఈ సమయంలో తులా రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధిత విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి. అంతేకాకుండా నూతన వెంచర్లు. ప్రాజెక్టులకు దూరంగా ఉండండి. ఎందుకంటే నష్టపోయే అవకాశముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో స్వల్పంగా నష్టపోయే ప్రమాదముంది. అనవసర విషయాల్లో తలదూర్చకపోతే మంచిది.

​వృశ్చికం..

సూర్యగ్రహణం ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెలవారీ బడ్జెట్లు అధికంగా ఉండటం వల్ల ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా అనవసర ఖర్చుల వల్ల ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది. కంటికి సంబంధిత అనారోగ్యం వేధిస్తుంది. దీనిపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. మీపై అధికారుల మన్ననలు పొందేందుకు ప్రయత్నించండి.

​ధనస్సు..

సూర్యగ్రహణం ప్రభావం వల్ల ధనస్సు రాశి వారికి ఊపిరితిత్తులకు సంబంధించి కొన్ని సమస్యలను కలిగి ఉంటారు. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలు కూడా పెరగవచ్చు. ఈ కాలంలో కొంత ఆర్థిక కొరతను కూడా అనుభవించవచ్చు. ఇతరుల నుంచి డబ్బు వసూలు చేయకుండా ఉండటానికి ప్రయత్నిచండి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

​మకరం..

ఈ సూర్యగ్రహణం వల్ల మకర రాశి వారికి ఆకస్మిక నష్టాలు లేదా ఊహించని ఖర్చులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు గణనీయమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా మానసిక అస్థిరతను కూడా ఈ సమయంలో ఎదుర్కోవచ్చు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు వాటిని అధిగమిస్తారు.

​కుంభం..

సూర్యగ్రహణం ప్రభావం వల్ల కుంభ రాశి వారి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. మీ ఆదాయం క్షీణిస్తున్నందున మీ ఆదాయం, ఖర్చుల మధ్య సరైన సమతుల్యతను కాపాడుకోవడంలో విఫలమవుతారు. మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురువుతాయి.

​మీనం..

సూర్యగ్రహణం ప్రభావం వల్ల మీన రాశి వారు పని ప్రదేశంలో అసౌకర్యానికి గురవుతారు. ఉద్యోగ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. వ్యాపారంలో ఆకర్షణీయమైన పథకాలను అందించడం ద్వారా నూతన కస్టమర్లను తీసుకురావడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment