శ్రావణ శుక్రవారం..
వ్రతాల్లో, పూజల్లో శ్రావణ శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రావణ
మంగళవారాల్లో గౌరీదేవిని ఆరాధిస్తే, శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం
నాడు చేసే ‘వరలక్ష్మీ’ వ్రతం అత్యంత పుణ్యప్రదమైనదిగా స్ర్తీలు భావిస్తారు.
ఈ నెలలో 5, 12, 19, 26వ తేదీల్లో నాలుగు శుక్రవారాలు వచ్చాయి. ఇవన్నీ
శ్రావణ శుక్రవారాలు. శ్రావణ శుక్రవార వ్రతం వల్ల పాపాలు పోవడమే కాక లక్ష్మీ
ప్రసన్నులు కాగలరు. అందులో శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్రవారం చాలా
మహత్తు గలది. ఈ వ్రతం ధన, కనక, వస్తు, వాహనాది వృద్ధికి మూలమని
విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో శ్రావణ లక్ష్మీ వ్రతం, పూజా విధానం సూర్య
పాఠకులకు ప్రత్యేకం.
ఓం మహాగణాధిపతయే నమః
ఓం ఆచమ్య కేశవాయ నమః, ఓం నారాయణాయనమః, శ్రీకృష్ణార్పణమస్తు మమ ఉపాత్తసమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అిస్మిన్ వర్తమాన వ్యావహారిక
చాంద్రమానేన .......
నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్ల పక్షే చతుర్థాశ్యాం భృగువాసరే, శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ... శ్రీమత్యా (పేరు)...గోత్రవత్యాః సభర్తృకాయాః అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, దర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సత్సంతాన సౌభాగ్య ఫలావ్యాప్యర్థం, శ్రీవరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీవరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్ఛక్తిధ్యానవాహనాది షోడషోపచార పూజాం కరిష్యే, ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థంత్వేన శ్రీమహాగణపతి పూజాం కరిష్యే, తదంగ కలశ పూజాం కరిష్యే (అని సంకల్పం చేసుకుని పాత్రకు గంధం, కుంకుమబొట్లు పెట్టి కలశంలో గంధం, పుష్పం, అక్షతలు వేసి కుడిచేతితో కలశం పట్టుకొని)
శ్లో
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రీతః
మూలేతత్రస్థితోబ్రహ్మమధ్యే మాతృగణాస్మృతా
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదో ధ యజుర్వేదః సామవేదో హృధర్వణః
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రీతాః
ఆయాస్తు శ్రీవరలక్ష్మీ పూజార్థం దురితక్షయ కారకాః
అథ ధ్యానమ్
శ్లో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా
క్షీరోదధి సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసుర సమస్కృతే
శ్రీవరలక్ష్మీ దేవతాం ధ్యాయామి
శ్లో సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే
ఆవాహయామి దేవీత్వాం సుప్రీతా భవ సర్వదా
శ్రీవరలక్ష్మీదేవతా మావాహయామి
శ్లో సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫుర ద్రత్న విభూషితే సింహాసనమిదం దేవీ గృహత్యాం సురపూజితే
శ్రీవరలక్ష్మీ దేవతాయై రత్న సింహాసనం సమర్పయామి
శ్లో శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రీతం
అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహత్యాం హరివల్లభే
శ్రీవరలక్ష్మీ అర్ఘ్యం సమర్పయామి
శ్లో సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ సమస్మృతే
శ్రీవరలక్ష్మీ పాద్యం సమర్పయామి
శ్లోసువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం
గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే
శ్రీవరలక్ష్మీ ఆచమనం సమర్పయామి
శ్లో పయోదధి ఘృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే
శ్రీవరలక్ష్మీ పంచామృతం సమర్పయామి
శ్లో గంగాజలం మయానీతం మహాదేవ శిరిస్థ్సితం శుద్ధోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరీ
శ్రీవరలక్ష్మీ శుద్ధోదక స్నానం సమర్పయామి
స్నానానంతరం ఆచమనీయం సమర్పమాయి
శ్లో సురార్చితాంఘ్రి యుగళేదుకూలవసనప్రియే
వస్తయ్రుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే
శ్రీవరలక్ష్మీ వస్తయ్రుగ్మం సమర్పయామి
శ్లో కేయూర కంకణా దేవీ హార నూపూర మేఖలాః
విభూషణా న్యమూల్యాని గృహాణ సురపూజితే
శ్రీవరలక్ష్మీ ఆభరణాని సమర్పయామి
శ్లో తప్త హేమకృతం దేవీ మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవీ గృహాణ త్వం శుభప్రదే
శ్రీవరలక్ష్మీ మాంగళ్యం సమర్పయామి
శ్లో కర్పూరాగరు కస్తూరి రోచనాది సుసంయుతం
గంధం దాస్యామి తే దేవీ స్వీకురుష్వ శుభప్రదే
శ్రీవరలక్ష్మీ గంధం దాస్యామి ధారయామి
శ్లో అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్
తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమో
పేతాన్ స్వీకురుష్వాబ్ది పుత్రికే
శ్రీవరలక్ష్మీ అక్షతాన్ సమర్పయామి
శ్లో మల్లికా జాజికుసుమై శ్చంపకై ర్వకుళైరపి
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే
అధాంగపూజ
చంచలాయై నమః పాదౌ పూజయామి
చపలాయై నమః జానునీ పూజయామి
పీతాంబరధరాయై నమః ఊరూ పూజయామి
కమలవాసిన్య నమః నాభిం పూజయామి
పద్మాలయాయై నమః నాభిం పూజయామి
మదన మాత్రే నమః స్తనౌ పూజయామి
లలితాయై నమః భుజద్వయం పూజయామి
కంబుకంఠై నమః కంఠం పూజయామి
సుముఖాయై నమః ముఖం పూజయామి
శ్రీయై నమః ఓష్ఠౌ పూజయామి
సువాసికాయై నమః నాసికాం పూజయామి
సునేత్రై నమః నేత్రా పూజయామి
రమాయై నమః కరౌ పూజయామి
కమలాయై నమః శిరః పూజయామి
వరలక్షై్మ నమః సర్వాంగణ్యామి పూజయామి
శ్రీవరలక్ష్మీ దేవతాం పుషె్పైః పూజయామి
అష్టోత్తర శతనామావళి
ఓం ప్రకృతె్యై నమః ఓం కామాక్షై నమః
ఓం వికృతె్యై నమః ఓం క్రోధ సంభవాయై నమః
ఓం విద్యాయై నమః ఓం అనుగ్రహాయైనమః
ఓం సర్వభూతహిత
ప్రదాయై నమః ఓం బుద్ధయే నమః
ఓం శ్రద్ధాయై నమః ఓం అనఘాయైనమః
ఓం విభూతె్యై నమః ఓం హరివల్లభాయై నమః
ఓం సురభె్యై నమః ఓం అశోకాయైనమః
ఓం పరమాత్మికాయై నమః ఓం అమృతాయైనమః
ఓం వాచే నమః ఓం లోకవినాశినై్య నమః
ఓం పద్మాలయాయై నమః ఓం ధర్మనిలయాయైనమః
ఓం పద్మాయై నమః ఓం కరుణాయైనమః
ఓం శుచయే నమః ఓం లోకమాత్రే నమః
ఓం స్వాహాయై నమః ఓం పద్మప్రియాయై నమః
ఓం స్వధాయై నమః ఓం పద్మహస్తాయై నమః
ఓం సుధాయై నమః ఓం పద్మాక్షై్య నమః
ఓం ధన్యాయై నమః ఓం పద్మసుందరె్యై నమః
ఓం హిరణ్మయాయై నమః ఓం పద్మోద్భవాయై నమః
ఓం లక్షై్మ నమః ఓం పద్మముఖె్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం విభావరె్యై నమః ఓం రమాయై నమః
ఓం ఆదిత్య నమః ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దితె్యై నమః ఓం దేవె్యై నమః
ఓం దీప్తాయై నమః ఓం పద్మినై్య నమః
ఓం వసుధాయై నమః ఓం పద్మగంధినై్య నమః
ఓం వసుధారిణ్య నమః ఓం పుణ్య గంధాయై నమః
ఓం కమలాయై నమః ఓం ప్రసాదాభిముఖె్యై నమః
ఓం కాంతాయై నమః ఓంప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః ఓం సిద్ధే్య నమః
ఓం చంద్రాయై నమః ఓం స్రైణ్య సౌమ్యాయై నమః
ఓం చంద్రసహోదరె్యైనమః ఓం శుభప్రదాయై నమః
ఓం చతుర్భుజాయై నమః ఓం నృపవేశ్మగతానందాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః ఓం ఇందిరాయై నమః
ఓం వరలక్షై్మ నమః ఓం ఇందుశీతలాయై నమః
ఓం వసుప్రదాయై నమః ఓం ఆహ్లాదజననై్య నమః
ఓం శుభదాయైనమః ఓం పుష్టై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం శివాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః ఓం శివకరె్యై నమః
ఓం సతె్యై నమః ఓం బిల్వనిలయాయై నమః
ఓం విమలాయై నమః ఓం జయాయై నమః
ఓం విశ్వజననై్య నమః ఓం మంగళాయై నమః
ఓం తుష్టై నమః ఓం దేవె్యై నమః
ఓం దారిద్య్రనాశినై్య నమః ఓం విష్ణు వక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రీతి పుష్కరిణై్య నమః ఓం శాంతాయై నమః
ఓం విష్ణుపతె్న్యై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం ప్రసన్నాక్షై నమః ఓం శ్రీయై నమః
ఓం నారాయణ సమాశ్రీతాయై నమః
ఓం భాస్కరె్యై నమః ఓం దారిద్య్రై ధ్వంసినై్య నమః
ఓం సుప్రసన్నాయై నమః ఓం దేవె్యై నమః
ఓం వరారోహాయై నమః ఓం సర్వోపద్రవ వారిణై్య నమః
ఓం యశస్వినై్య నమః ఓం నవదుర్గాయై నమః
ఓం వసుంధరాయై నమః ఓం మహాకాళె్యై నమః
ఓం ఉదారాంగాయై నమః ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం హరిణై్య నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
ఓం హేమమాలినై్య నమః ఓం భువనేశ్వరె్యై నమః
ఓం ధన ధాన్య కరె్తై్య నమః ఓం వరలక్ష్మీ దేవతాయై నమః
అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి
శ్లో దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ మనోహరం
ధూపందాస్యామి తే దేవీ గృహాణ కమలప్రియే
శ్రీవరలక్ష్మీ దేవతాయై ధూపమాఘ్రాపయామి
శ్లో ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం
దీపం దాస్యామి తే దేవీ గృహాణ ముదితాభవ
శ్రీవరలక్ష్మీ దీపం దర్శయామి
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి
శ్లో నైవేద్యం షడ్రసోపేతం దధి మధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే
శ్రీవరలక్ష్మీ నైవేద్యం సమర్పయామి
శ్లో ఘనసార సుగంధేన మిశ్రీతం పుష్పవాసితం
పానీయం గృహత్యాం దేవీ శీతలం సుమనోహరం
శ్రీవరలక్ష్మీ పానీయం సమర్పయామి
శ్లో పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీవరలక్ష్మీ తాంబూలం సమర్పయామి
శ్లో నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహందీవీ గృహ్యతాం విష్ణువల్లభే
శ్రీవరలక్ష్మీ నీరాజనం సమర్పయామి
శ్లో పద్మాసనే పద్మకరే సర్వ లోకైక పూజితే
నారాయణప్రియే దేవీ సుప్రీతాభవసర్వదా
శ్రీవరలక్ష్మీ మంత్ర పుష్పం సమర్పయామి
శ్లో యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణే పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవా
త్రాహిమాం కృపయా దేవీ శరణాగత వత్సలే
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష జనార్ధని
శ్రీవరలక్ష్మీ ప్రదక్షిణం సమర్పయామి
శ్లో సమస్తలోక జననీ నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమోనమః
శ్రీవరలక్ష్మీ నమస్కారాన్ సమర్పయామి
తోర పూజ
(తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈక్రింది విధంగా పూజించాలి)
కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి, రమాయైనమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజననై్య నమః చతుర్థ గ్రంథిం పూజయామి, మహాలక్షై్మనమః పంచమ గ్రంథిం పూజయామి క్షీరాబ్ది తనయాయై నమః షష్ట గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణై్య నమః సప్తమ గ్రంథిం పూజయామి, హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి
ఈక్రింది శ్లోకం చదువుతూ తోరం కట్టుకోవాలి
శ్లో బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే
ఈక్రింది శ్లోకం చదువుతూ వాయనం ఇవ్వాలి
శ్లో ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వైదదాంతి చ
ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమోనమః
యస్యస్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు, న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతం మన్త్రహీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వరి, యత్పూజితం పరిపూర్ణం తరస్తుతే. అనయా కల్పోక్త ప్రకారేణ కృతయా షోడషోపచార పూజయా భగవతీ సర్వదేవాత్మికా వరలక్ష్మీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదాభవతు. మము ఇష్టకార్యార్థ సిద్ధిరస్తుః (అక్షతలు, నీళ్లు విడిచి పెట్టాలి) వాయనమిచ్చి అక్షతలు పుచ్చుకొని వ్రత కథను చదువుకోవాలి. (పూజా విధానం సమాప్తం )
కథా ప్రారంభం
సూత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహర్షులను జూచి ఇట్లనియె. ‘‘ ముని వర్యులారా స్ర్తీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి యొక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి జెప్పె. దానింజెప్పెద వినుండు. కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిగణ ఖచితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి యుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, ‘‘దేవా లోకంబున స్ర్తీలు ఏవ్రతంబొనర్చిన సర్వ సౌభాగ్యములును, పుత్రపౌత్రాదులును కలిగి సుఖంబుగ నుందురో, అట్టి వ్రతంబు నాకానతీయ వలయు’’ నని నప్పరమేశ్వ రుండిట్లనియె ‘‘ ఓ మనోహరీ స్ర్తీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలుగజేసెడి వరలక్ష్మీ వ్రతంబను నొక వ్రతంబు గలదు.
ఆవ్రతంబును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము నాడు చేయవలయు ‘‘ననిన పార్వతీదేవి ఇట్లనియె: ‘‘ఓ లోకారాధ్యా నీ వానతి ఇచ్చిన వరలక్ష్మీ వ్రతంబును ఎట్లు చేయవలయును? ఆ వ్రతంబునకు విధి ఏమి? ఏ దేవతను పూజింప వలయును? పూర్వం బెవరిచే నీ వ్రతం బాచరింపబడియె? వీని నెల్ల సవివరంబుగా వచింపవలయు’’ నని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయనీ వరలక్ష్మీ వ్రతమును సవిస్తరంబుగ జెప్పెద వినుము: మగధ దేశంబున కుండినంబను నొక పట్టణంబు గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోను, బంగారు గోడలు గల ఇండ్లతోతను గూడియుండు: అట్టి పట్టణము నందు చారుమతి యను నొక మహిళ గలదు.
ఆ వనితామణి ప్రతి దినంబును ఉషఃకాలమున మేల్కాంచి స్నానంబు చేసి పెద్దలకు అనేక విధంబులైన యుపచారంబులు జేసి. ఇంటి పనులను జేసికొని మితముగాను, ప్రియముగాను భాషించుచు నుండెను. ఇట్లుండామె యందు మహాలక్ష్మికి యనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబుల నిచ్చెదనని వచించిన, చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షణ నమస్కారములు జేసి యనేక విధంబుల స్తోత్రము చేసి ‘‘ ఓ జగజ్జననీ నీ కటాక్షంబు గలిగెనేని జనులు ధన్యులుగను, విద్వాంసులుగను సకల సంపన్నులుగను నయ్యెదరు.
నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషం వలన నీపాద దర్శనంబు నాకు గలిగెనని చెప్పిన మహాలక్ష్మీ సంతోషంబు చెంది చారుమతికి ననేక వరంబులిచ్చి యంతర్థానంబునొందె, చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలంజూచి వరలక్ష్మీదేవిని గానక ఓహో నేను కలగంటిననుకుని భావించి యా స్వప్న వృత్తాంతమును పెనిమిటి, మామగారు మొదలైన వాండ్రతో జెప్పి వారు ఈస్వప్పము మిగుల నుత్తమమైనది, శ్రావణమాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం బవశ్యంబుగ జేయవలసిదని చెప్పిరి. పిమ్మట చారుమతియును, స్వప్నంబు విన్న స్ర్తీలును శ్రావణమాసంబెప్పుడు వచ్చునా అని ఎదురుచూచుచుండిరి.
ఇట్లుండగా వీరి భాగ్యోదయయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతి మొదలగు స్ర్తీలందరునూ ఈ దినంబేగదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని, ఉదయంబుననే మేల్కాంచి, స్నానంబులం జేసి, చిత్ర వస్త్రంబులం గట్టుకుని, చారు మతీదేవి గృహంబున నొక ప్రదేశము నందు గోమయముచే నలికి మంటపంబే ర్పరచి,యందొక యాసనంబువైచి, దానిపై క్రొత్త బియ్యము పోసి, మర్రి చిగుళ్లు మొదలగు పంచవల్లములచే కలశం బేర్పరచి, యందు వరలక్ష్మీదేవిని ఆ వాహనము జేసి, మిగుల భక్తి యుక్తు లై ధాన్యాది వాహనాది షోడషోపచార పూజలను జేసి, తొమ్మిది సూత్రంబులు గల తోరంబును దక్షిణ హస్తంబున గట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్తభోజ్యం ప్రదక్షిణము చేయగానే ఆ స్ర్తీల కందరికి కాళ్లయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము గలిగె.
అంతకాళ్లం జూచి కొనిన గజ్జెలు మొదలగు నాభరణములు గలిగియుండగ. వారందరును ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన గలిగినవని పరమానందంబునొంది మరియొక ప్రదక్షిణంబు చేయ హస్తముల యందు ధనద్ధగాయ మానంబుగ పొలయుచుండు నవరత్న ఖచితంబులైన కంకణంబులు మొదలగు నాభరణములుండుటం గనిరి. ఇంక చెప్పనేల: మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే యా స్ర్తీలందరూ సర్వభూషణాలంకృతులైరి. ఆ స్ర్తీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై నా స్ర్తీలందోడ్కొని గృహంబులకు బోవుటకు వారివారి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిల్చియుండెను.
పిదప చారుమతి మొదలగు స్ర్తీలందరు తమచే కల్పోక్త ప్రకారంముగా పూజ చేయించిన పురోహితునికి పండ్రెండు కుడుములు వాయన దానం బిచ్చి, దక్షిణ తాంబూలంబు నొసంగి, ఆశీర్వాదంబు నొంది, వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువుల తోడ నెల్లరును భుజించి. తమ కొరకు వచ్చి కాచుకుని యున్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనముల నెక్కి తమ తమ ఇండ్లకు బోవుచూ ఒకరితో నొకరు ‘‘ఓహో చారుమతీ దేవి భాగ్యంబేమని చెప్ప వచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తాను స్వప్నములో వచ్చి ప్రత్యక్షంబాయెను. ఆ చారుమతీ దేవి వలననే గదా మనకిట్టి మహా భాగ్య సంపత్తులు గలిగెనని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచూ తమ తమ ఇండ్లకు పోయిరి.
పిదప చారుమతీ దేవి మొదలగు స్ర్తీలందరును ప్రతి సంవత్సరము నీవ్రతంబు సేయుచూ పుత్ర పౌత్రాభివృద్ధి గలిగి ధన కనక వస్తు వాహనముల తోడం గూడుకుని సుఖంబుగ నుండిరి. కావున ఓ పార్వతీ, ఈ ఉత్తమమైన వ్రతమును అందరును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యంబులును గలిగి సుఖంబులుగ నుందురు. ఈకథను వినువారలకును, చదువు వారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్ధించును’’ అని పరమేశ్వరుడు పలికెను.
వరలక్ష్మి వ్రతకల్పం సమాప్తం.
No comments:
Post a Comment