శీతల అమావాస్య
శివుని ఆరాధించే వారు శైవులు , విష్ణువును ఆరాధించేవారిని వైష్ణవులు , ఆదిశక్తి ని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారిని శాక్తేయులు అంటారు.శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు.గ్రామ సరిహద్ధులను కాపాడే దేవత పొలిమేరమ్మ.మసూచి,ఆటలమ్మ లాంటి కొన్ని రోగాలొస్తే అమ్మవారు పోసిందనటం అర్ధరహితం కాపాడే దేవతపై అపనిందమోపటమే అవుతుంది.సరస్వతి, లక్ష్మి, పార్వతిలు కలసిన పరమశక్తి పోలేరమ్మఅంటారు.పోలేరమ్మను తెలంగాణాలో పోచమ్మ అంటారు.మాతృస్వామిక వ్యవస్ధకు చెందిన గ్రామ దేవతలు దళిత దేవతలు.బహుజన సంస్కృతి పరిరక్షకులు.సమాజంలోని బడుగుకులాలవారు కూడా అగ్రకులాలతోపాటు సమానంగా సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవటం ఈ గ్రామదేవతల జాతరల వల్ల సాధ్యమయ్యింది. వర్షాలు పడాలని పోలేరమ్మ తిరునాళ్లు, కొలుపులు చేస్తారు.పోలేరమ్మకు జంతు బలులు ఇస్తారు. మేకలు,పొట్టేళ్ళు, కోళ్ళను నరకడం ,పొంగళ్ళు పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం జరుగుతుంది.

No comments:
Post a Comment