శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పౌర్ణమి, ప్రదోషం నాడు పూజిస్తే..
లక్ష్మీ నరసింహుడు, సత్యనారాయణ స్వామి వంటి విష్ణుమూర్తులను పౌర్ణమి, ప్రదోషం నాడు పూజిస్తే.. ఏలినాటి శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది. అలాగే ఈతిబాధలుండవని, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రదోషం, పౌర్ణమి, స్వాతి నక్షత్ర సమయంలో కొబ్బరి నీరు, పాలు, పన్నీరు, తేనె, పసుపు, సుమంగళిచందనం, తిరుమంజన పొడి వంటి అభిషేక వస్తువులతో అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయి. అభిషేకానికి పూర్తయిన తర్వాత తులసీ మాలను అర్పించి స్తుతించే వారికి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి.
లక్ష్మీ నరసింహ స్వామినిపై తిథుల్లో ఆరాధించే వారికి తీరని పదోన్నతి, విదేశీయానం చేకూరడంతో పాటు రుణబాధలు, మానసికాందోళనలు తొలగిపోతాయి.
No comments:
Post a Comment