Sunday 21 August 2016

శివుడు స్మశానాలలో నివసించటంలో,వంటి నిండా బూడిద పూసుకోవటంలో తత్త్వమేమి?

శివుడు స్మశానాలలో నివసించటంలో,వంటి నిండా బూడిద పూసుకోవటంలో తత్త్వమేమి?


శివుడు స్మశానాలలో నివసించటంలో తత్త్వమేమి?


 ఒకే తత్త్వం వుంది. దానికి పేరే లేదు. రూపమూ లేదు. అది అలా వుండగా సృష్టి ప్రారంభమయ్యేటప్పటికి ఆ తత్త్వానికి బ్రహ్మ అనే పేరు వచ్చింది. ఆ సృష్టి కొంతకాలం నిలిచి వుంది. ఆ దశలో ఆ తత్త్వానికి విష్ణువని పేరు వచ్చింది. ఇంతలో ఆ సృష్టి అంతరించిపోయింది. ఆ దశలో ఆ తత్త్వానికి శివుడని పేరు వచ్చింది. కాగా, జీవుల యొక్క అంతిమ దశకు సంకేతం స్మశానం. కనుకనే స్మశానం శివుడికి ప్రధాన నివాస స్థానమైంది.
 


శివుడు వంటి నిండా బూడిద పూసుకోవటంలో సంకేతార్థమేమి?

  సృష్టి లయం చెందిన దశలో వుండే తత్త్వం వేరే శివుడని చెప్పుకున్నాం గదా! మామూలు లోకంలో ఏ పదార్థమైనా, నాశనమయినప్పుడు, అనగా దహించుకుపోయినప్పుడు చిట్టచివరికి మిగిలేది భస్మమే. కనుక అది శివుడికి రూపాంతరం. అందువల్లే శివుడు నిత్యమూ భస్మలేపన ప్రియుడై వుంటాడు.

No comments:

Post a Comment