సర్వ ఏకాదశి
శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం
విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం.
ఏకాదశి రోజున కర్షకులు పూజ పూర్తయిన తర్వాత పొలానికి వెళ్ళి పని
చేసుకుంటారు. ఈవేళ తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను
మాట్లాడ్డం లాంటి పనులు ఏమైనా ఈవేళ చేస్తారు. వాళ్ళను ఈవేళ పనిలోకి రమ్మని
ప్రత్యేకంగా చెప్తారు. కొత్త ఒప్పందాలు ఏవైనా ఈవేళ కుదుర్చుకుంటే మంచిదని
నమ్మి అలా చేస్తారు. మరే మార్పుచేర్పులు అయినా ఈ తొలి ఏకాదశినాడు చేపడతారు.
ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో
నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు.
ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.
ఏకాదశి ముఖ్యమైన పండుగ
దినంగా భావించి, ఉపవాసం ఉంటారు. ఈవేళ ఉపవాసం కనుక గారెలు, బూరెలు లాంటి
పిండివంటలు ఏమీ చేయరు. కొందరు నేతితో పాయసం వండి ప్రసాదంగా పంచుతారు.
పండ్లు మాత్రమే సేవిస్తారు.
ఓం నమో నారాయణ
No comments:
Post a Comment