కేతువు
కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. సూర్యుడిని ప్రదిక్షిణం చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల కాలం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని ఏడవ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం ఏడు సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి పుట్టిన ఆరంభ దశ కేతు దశ. కేతువుకు అవల, శిఖి, ధూమ, ధ్వజ, మృత్యు పుత్ర అనే ఇతర నామాలు ఉన్నాయి. కేతువు పురుష గ్రహము. గ్రహ స్వభావం పాప గ్రహం, తత్వం వైరాగ్యము, స్వభావం క్రూర స్వభావం, గుణం తమోగుణం, దిక్కు వాయవ్యము, ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. ఆత్మాధికారం మోక్షం, పాలనా శక్తి భటుడు, లోహము ఇనుము, కుటుంబ సభ్యుడు తాత, వర్ణం ధూమ్ర వర్ణం, గ్రహ పీడ అతి తెలివి, గ్రహ వర్గం గురువు, గృహంలోని ఖాళీ ప్రదేశాలను సూచిస్తాడు, కాల బలము పగలు, కాల బలం పగలు, శత్రు క్షేత్రం కటకం, సమ క్షేత్రం మీనము, ఉచ్ఛ క్షేత్రము వృశ్చికము, నీచ క్షేత్రము వృషభము, మిత్రులు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శత్రువులు శని, శుక్రుడు, సములు గురువు, బుధుడు. వయసు ముసలి వయసు, చెట్లు ముళ్ళ చెట్లు, ధాన్యం ఉలవలు, పండ్లు సీతా ఫల, ప్రదేశములు గుహలు, బిలములు. దేశంలో కేతువు ఆధిక్యత ఉన్న ప్రదేశం అంతర్వేధి.ధాన్యము ఉలవలు, పక్షులు రాబందు, గద్ద, కోడి. జంతువులు కుక్క, పంది, గాడిద. మూలికలు తెల్ల జిల్లేడు, పున్నేరు వేరు, సమిధలు దర్భ. దైవ వర్గం వైష్ణవ, గోత్రము పైఠీనస. అవతారం మీనావతారం. గ్రహారూఢ వాహనం గ్రద్ద, రత్నము వైఢూర్యం, రుద్రాక్ష నవ ముఖ రుద్రాక్ష, లోహము కంచు, శుభ సమయం ఉదయ కాలం. వారము ఆదివారం. స్వభావం చంచల స్వభావం. దృష్టి అధోదృష్టి.
కారకత్వము
కేతువు కుటుంబ సభ్యులలో తాత(తల్లికి తండ్రి)ను సూచిస్తాడు. కేతువు దైవోపాసన, వేదాంతం, తపస్సు, మోక్షము, మంత్ర శాస్త్రము, భక్తి, నదీస్నానం, మౌన వ్రతం, పుణ్యక్షేత్ర దర్శనం, మోసము, పరుల సొమ్ముతో సుఖించుట, దత్తత మొదలైన వాటిని సూచిస్తాడు.రూపము
కేతువు పార్ధివ నామసంవత్సరం ఫాల్గుణమాసం శుక్ల పౌర్ణమి అభిజిత్ నక్షత్రంలో బుధవారం జన్మించాడు. కేతువు గోత్రం జైమినీ పైఠీనస. కేతువు బూడిద(బూడిద)వర్ణంలో రెండు భుజములతో ఉంటాడు. కేతువు వాహనం గ్రద్ద. బ్రహ్మదేవుడికి తాను సృష్టించి జనం అపారంగా పెరగడంతో వారిని తగ్గించడానికి మృత్యువు అనే కన్యను సృష్టించాడు. మానవులకు మరణం ఇచ్చే బాధ్యతను అప్పగించాడు. తనకు మరణం ఇచ్చినందుకు ఆ కన్య దుఃఖించింది. ఆమె కన్నీటి నుండి అనేక వ్యాధులు ఉద్భవించాయి. అప్పుడు తెల్లని పొగ రూపంలో ఒక పురుషుడు జన్మించాడు. కీలక నామ సంవత్సరం మార్గశిర కృష్ణ అమావాస్య నాడు మంగళ వారం మూలా నక్షత్రంలో కేతువు జననం జరిగింది. బ్రహ్మ ఆజ్ఞానువర్తి అయి కేతువు ధూమ్ర కేతువుగా సంచరించ సాగాడు. క్షీరసాగర మధన సమయంలో మోహినీ చేతి అమృతం తాగిన తరువాత విష్ణువుకేతువు తల నరికి ఆస్థానమలోపాము తలను ధరింప చేసాడు. అప్పటి నుండి కేతువుగా నామధేయం చేయబడి విష్ణు అనుగ్రహం చేత గ్రహస్థితి పొందాడు. కేతువు పత్ని చిత్ర రేఖ. సాధారణంగా కేతువు ఒంటరిగా కుజ ఫలితాలను ఇచ్చినా ఏగ్రహంతో చేరి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. గ్రహస్థానం పొందిన కేతువు విష్ణువుకు అంజలి ఘటిస్తూ ఉంటాడు.పరిహారం
కేతుగ్రహ పరిహార పూజార్ధంగా కంచు ప్రతిమ శ్రేష్టం. అధి దేవత బ్రహ్మ.నైవేధ్యం చిత్రాన్నం, కుడుములు, ఉలవ గుగ్గిళ్ళు.
ప్రీతికరమైన తిథి చైత్ర శుద్ధ చవితి. ఆచరించ వలసిన వ్రతం పుత్ర గణపతి వ్రతం,
పారాయణం చేయవలసినది శ్రీ గణేశ పురాణం, కేతు అష్టోత్తర శతనామావళి, గణేశ శతనామావళి.
దక్షిణగా ఇవ్వ వలసిన జంతువు మేక,
ధరించ వలసిన రత్నం వైడూర్యం,(గెంత్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ,లేడీస్ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్).
ధరించ వలసిన మాల రుద్రాక్ష మాల,
ధరించ వలసిన రుద్రాక్ష నవముఖి రుద్రాక్ష.
ఆచరించ వలసిన దీక్ష గణేశ దీక్ష.
చేయ వలసిన పూజ విజ్ఞేశ్వర పూజ, సూర్యారాధన,
దానం చేయవలసిన ఆహార పదార్ధాలు ఖర్జూరం, ఉలవలు.
గ్రహస్థితిని పొందిన వారం బుధవారం. మండపం జెండా ఆకారం. గ్రహం బలంగా ఉంటే ఆధ్యాత్మిక చింతన బలహీనమైన అతి భయం కలుగుతుంది.
కేతు యంత్ర లోక్లేట్ ని ధరించడం.
కేతు యంత్రాన్ని విధి విధానం గా పూజించడం.
మేకపాలు కలిపి ఆ నీటితో స్నానము చేసినచో కేతుగ్రహ దోష నివారణ కలుగును.పంచలోహముల ఉంగరము ధరించుట సాంప్రదాయము.
శుభతిధి గల మంగళవారము నాటి నుండి ఓం-ప్రాం-ప్రీం-ప్రౌం-సః కేతవే నమః అను మంత్రమును 40 రోజులలో 7 వేలు జపము పూర్తి చేసి 41వ రోజున ఎర్రని వస్త్రములో ఉలవలు పోసి దానమిచ్చినచో కేతుగ్రహ దోష నివారణ కలుగును.
కేతువు స్థానములు
- లగ్నంలో కేతువు ఉన్నజాతకుడు అవయవములు కలవాడు సుఖహీనుడు, స్థానభ్రష్టుడు, మాయావులతో మాటాడు వాడు ఔతాడు. అధికంగా స్వేదం స్రవించువాడు, చక్కని ప్రజా సంబంధాలు కలిగిన వాడు, కృతఘ్నుడు, చాడీలు చెప్పువాడు, జాతిభ్రష్టుడు, స్థానభ్రష్టుడు, అసంపూర్ణమైన అవయవములు కలవాడు, మాయావులతో కలసి ఉండు వాడు ఔతాడు.
- ద్వితీయ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు విద్యలేని వాడు, విద్యాహీనుడు, ధనం లేనివాడు, అల్పపదములు పలుకువాడు, దుష్టబుద్ధి కలిగిన వాడు, పరుల మీద ఆధారపడి జీవించువాడు, శాంతస్వభావులు, ముక్తసరిగా మాటాడు వాడు ఔతాడు.
- తృతీయ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు చిరంజీవి, శక్తి సంపన్నుడు, ఆస్తి కలవాడు, కీర్తికలవాడు, భార్యాసమేతంగా జీవితం సాగించువాడు, సుఖంగా భుజించు వాడు, సోదరుని కోల్పోవు వాడు ఔతాడు.
- చతుర్ధ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు భూమిని, తల్లిని, వాహనములను, సుఖములను కోల్పోవును. స్వస్థలమును వదిలి అన్యప్రదేశంలో జీవించు వాడు. పరధనముతో జీవించు వాడు, గొడవలు పెట్టుకునే స్వభావం కలవాడు ఔతాడు.
- పంచమ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు గర్భకోశ వ్యాధి పీడితుడు ఔతాడు, సంతతిని నష్టం కలుగు వాడు, పిశాచపీడచేత బాధపొందు వాడు, దుర్బుద్ధి కలవాడు, మోసగాడు ఔతాడు.
- షష్టమ స్థానంలో కేతువు ఉన్నజాతకుడు మాటకారి, ఉదారుడు, ఉత్తమగుణ సంపన్నుడు, దృఢచిత్తుడు, మిగుల కీర్తివంతుడు, ఉన్నతోద్యోగి, శతృనాశనాపరుడు, కోరికలు సిద్ధించు వాడు ఔతాడు.
- సప్తమ స్థానమున కేతువు ఉన్న జాతకుడు అగౌరవం పొందు వాడు, దుష్టస్త్రీ సమేతుడు, అంతర్గత రోగపీడితుడు, కళత్రనష్టం పొందు వాడు, శక్తి హీనుడు,
- అష్టమ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు అల్పాయుష్మంతుడు, ప్రాణమిత్రులను విడిచిన వాడు, కలహములతో జీవించువాడు, ప్రాణమిత్రులను విడిచిన వాడు, ఆయుధముల చేత గాయపడిన వాడు, నిరాశా నిస్పృహలతో కార్యములు చేయువాడు, కళత్రముతో పేచీలు పడువాడు ఔతాడు.
- నవమ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు పాపచింతన కలిగిన వాడు, అశుభవంతుడు, పితృదేవతలను అణచివేయు వాడు, దురదృష్ట వంతుడు, ప్రసిద్ధులను దూషించు వాడు, చత్వారం, మంచి కళత్రం కలిగినవాడు ఔతాడు.
- దశమ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు కార్యములలో విజ్ఞములు కలుగు వాడు, మలినుడు, నీచమైన కార్యములు చేయువాడు, శక్తిమంతుడు, బహుకీర్తిమంతుడు, తాత్విక చింతన కలవాడు ఔతాడు.
- ఏకాదశ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు ధనవంతుడు, బహుగుణవంతుడు, భోగి, మంచి వస్తువులు పొందు వాడు, ప్రతి కార్యమునందూ విజయం సాధించు వాడు, హాస్యచతురత కలిగిన వాడు ఔతాడు.
- ద్వాదశ స్థానంలో కేతువు ఉన్న జాతకుడు రహస్యంగా దురాచారములు చేయువాడు, అధమ కార్యాలు చేయువాడు, ధననాశనం పొందిన వాడు, ఆస్తిని నాశనం చేయువాడు, విరుద్ధమైన ప్రవర్తజ్ఞ కలిగిన వాడు, నేత్రరోగి, విదేశీయానం చేసేవాడు ఔతాడు.
వైడూర్యము :
వైడూర్య
రత్నలు కేతు గ్రహానికి సంభంధించినవి. న్యాయాన్యాయ వివేచన, పుణ్యపాప
వివక్షత, ధర్మాధర్మ పరిశీలనలు గల చిత్ర గుప్తుని అంశవల్ల ఈ వైడూర్య రత్నాలు
పుట్టినట్లు కొందరు చెబుతారు. శరత్కాలంలో చంద్రుని యొక్క షోడస కళలు గల
వెన్నెల కిరణలు కొన్ని రసాయన ధాతువులు కలిగిన శిలాభూములయందు ప్రవేశించి
అచ్చట రసధాతువులు గల శిలాభూములయందు ప్రవేశించి అచ్చటి రసధాతువులుగల శిలలకు
చంద్రకిరణములకు కలిగే పరస్పర సంయోగం వలన ఆశిలలు కొంత కాలానికి వైడూర్య
రత్నాలుగా మారతున్నవని కొందరి అభిప్రాయము.
అశ్వని,
మఘ, మూల జన్మ నక్షత్రాలుగా కలిగియున్నవారువైడూర్యాన్ని ఏ సమయములో నైనను
ధరించవచ్చును. మిగిలిన నక్షత్రములు గలవారు తమ జన్మ కాలమందలి గ్రహస్థితి
ననుసరించి కేతువు యొక్క దోషప్రదమైన కాలము నందు ఈ రత్నము ధరించుట ఉత్తమము.
జన్మజాతకములందు శుభస్థానములందు కేతువు బలహీనుడై ఉన్నప్పుడు వైడూర్యధారన
చేసిన ఆ కేతువు సకల శుభముల నొసగును. బలవంతుడైన కేతుగ్రహము 6-8-12
స్థానములందుండుట ఆ స్థానాధిపతులతో కలసి చూడబడుట చాలా దోషప్రదము. పాపగ్రహముల
యతి, దృష్టి వేధల వంటి సంబంధములు కలిగియున్న కేతువు అపకారమును చేయగలడు,
లగ్నము నుండి 2 వ స్థానమునందు పాపబలముగల కేతువుండుట, ఆ విధముగా పంచమ
స్థానమందుండుట, ఏడవ స్థాన మునందుండుట 9 వ స్థానమునందుండుట కూడా దోషప్రదమే!
జన్మ లగ్నము ననుసరించి ఏర్పడిన గ్రహములు బలాబలములందు కేతుగ్రహము పూర్తి
బలవంతుడై దుష్ఠ స్థానములందుండగా అతని మహర్దశ, అంతర్దశలు, ఇతర యోగదశలలో ఇతని
అంతర్దశలు, విదశలు సంభవించినప్పుడుషడ్వర్గబలము, అషటకవర్గ బిందు బలము కలిగి
కేతువు గోచారము నందు దుష్టస్థానములందు సంభవించు గొప్ప భయముతో కూడిన
కష్టములు ప్రాప్తించగలవు. అంతే గాక దోషప్రదమైన కేతు గ్రహానికి సంబంధించిన
కాలంలో పిచ్చి ఉన్మాదము, భిక్షుక వృత్తి, కృరప్రదేశములందు నివాసము సరియైన
ఆహార నిద్రాదులు లేకుండుట, సిరి సంపదలు అకారణముగా తొలగిపోవుట, కృషి నాశనము
ఉద్యోగ భంగము, కుటుంబకలహము విరక్తి, భార్య నష్టము పితృమృతి, సంతాన
కష్టనష్టములు, దుష్కీర్తి, అపజయము, వేదన, శతృభీతి విషజంతువులచే ప్రమాదము,
ధన సంభంధమైన ఇబ్బండులు, కోర్టు వ్యవహారములు కోర్టు వ్యవహారములలో ప్రతికూలత,
మనో వ్యద పిల్లల బాలారిష్టములు కురుపులు మొదలగు చేమ వ్యాదులు కలరా,
విడువని తల నొప్పి, అజీర్ణవ్యాధులు, దురదలు ఆటలమ్మ, తడపర, ఉబ్బాసం కాన్సర్,
ప్రసూతి బాధలు, నొప్పులు సరిగారాక పోవడం, కష్టమైన కాన్పు, గుర్రపు వాతము
తీవ్రమైన దరిద్రము, మొదలగు అనేక విషమ పరిణామములు సంభవించి దుఃఖపెట్టగలవు.
అటువంటి సందర్భాలలో వైడుర్య రత్నము ధరించడం వలన సత్ఫలితాలు
కలుగును.వైడూర్యాల ద్వారా కలిగే శుభయోగాలు : ఉత్తమ జతికి చెందిన దోషరహితమైన
వైడూర్యమును ధరించిన యెడల జీవితం అభివృద్ది దాయకంగా నుండుటయే గాక ఆర్ధిక
పుష్టి కృషిలో రాణింపు ఉద్యోగ ప్రాప్తి అధికారము జనాదరణ పలుకుబడి, కీర్తి
గౌరవ మర్యాదలు, భోగ భాగ్య సంపదలు వాహన ప్రాప్తి గృహ లబ్ది, కళత్ర సౌఖ్యము,
కుటుంబ సుఖశాంతులు శతృనాశనము, జయము కార్యశిద్ది దేహా రోగ్యము, సకల
వ్యాధినాశనము, ఆయువృద్ది, అరిష్టనివారణ, దుష్టగ్రహ బాధా విముక్తి,
దేవతానుగ్రహము సుఖము శాంతి సద్భావన, సజ్జన స్నేహము, సర్పదోష పరిహారము,
సంతానప్రాప్తి, వంశాభివృద్ది కలుగగలవు. వైడుర్యము అత్యంత మహిమాన్వితమైనదగుట
వలన దీన్ని ధరించెడి వాడికి సకల క్షేమము కలుగ చేయగలదు. ప్రసవకాలంలో
స్త్రీలకు కలుగు అనేక బాధలు నివారించి సుఖముగా శీఘ్రముగా ప్రసవము
జేయింపగలరు. ఈ రత్నమును నీటియందుంచి ఆ నీటిని ప్రసవ స్త్రీలచే త్రాగించిన
శీఘ్రముగా ప్రసవించుటయే గాక ప్రసవానంతరం సంభవించే దుష్టలక్షణముల నుండి
పూర్తిగా రక్షణ కలిగించగలదు.. చర్మ వ్యాధులు గలవారు ఈ వైడుర్యము ఆదివాసము
గావించిన నీటిచే స్నానము చేసిన అనతి కాలంలోనే చర్మ వ్యాధుల నుండి
విముక్తులై ఆరోగ్యవంతులు కాగలరు. గృహము నందలి సింహద్వారామునకు పైభాగమున
వైడూర్యములు తాపటము జేయించిన ఆ గృహమునందు నివశించే వారికి అమ్మవారు ఆటలమ్మ,
తడపర, కలరా, మొదలగు బాధించవు.
వైడూర్య
రత్నము అమోఘమైన శక్తి సంపన్నమై యున్నది. ఇది ధరించిన శతృవులు సైతం
మితృలుగా మారిపోగలరు. పగవారు చేయు చేత బడి, ప్రయోగములు మొదలగు కృత్రిమములు
భూత భేతాళ, యక్ష రాక్షస, శాకినీ, కామినీ మొహినీ, గ్రహబాధలు దరిజేరలేవు.
దీని వలన జీవితములో మంచి అభివృద్ది, మేధాశక్తి, ఆలోచనా పటిమను, కర్య సాధన,
జనాకర్షన, జనరంజనలకీ వైడూర్యమును మించిన రత్నము మరొకటి లేదు.
వైడూర్యాన్ని
ఇంగ్లిషులో 'క్యాట్స్ ఐ' (Cats eye) అంటారు. రాత్రివేళ పిల్లి కళ్ళలో హెడ్
లైట్స్ వెలుగు పడినప్పుడు ఆ కళ్ళలో ప్రతిఫలిచే రంగులు 'వైడూర్యం' లోనూ
మనకు కనిపిస్తాయి. పల్చని హనీబ్రౌన్ మరియు యాపిల్ గ్రీన్ రంగుల్లో వైడూర్యం
వుంటుంది.
వైడూర్యంలో దోషాలు:
కర్కరము: రాయి వలె కనిపించునవి
కర్కశము: గరుకుగా వున్నవి
త్రాసము: ముక్కలు ముక్కలుగా కనిపించునవి
దేహము: కాంతి లేకుండా వున్నవి.
కళంకము: నల్లని రంగులో వున్నవి
వైడూర్యమునకు ఇతర నామాలు:
లక్షణాలు:
రసాయన సమ్మేళనం:
'క్యాట్స్ ఐ'
క్రెసోబెరిల్ ప్యామిలీకి చెందినది. క్రెసోబెరిల్ అనేది అల్యూమినేట్
బెరీలియం. ఈ రత్నానికి దాని తాలూకు లస్టర్, రంగులోని రిచ్నెస్, ఐ తాలుకూ
షార్ప్ నెస్, క్లారిటీలతో షేప్ ని అనుసరించి విలువ నిర్ణయించడం జరుగుతుంది.
ఇన్ సైడ్ బ్యాండ్ బ్రిలియంట్ గా, స్త్రెయిట్ గా వుంటే వైడూర్యం సుపీరియర్
క్వాలిటీగా చెప్పబడుతుంది. అలాగే కొన్ని వైడూర్యాలు 'మిల్క్ అండ్ హనీ'
ఎఫెక్ట్ వ్ ని ప్రతిఫలిస్తాయి. అంటే ఈ వైడూర్యం మీద ప్లాష్ లైట్
వేసినప్పుడు సగభాగం తెల్లగా, మిగిలిన సగభాగం తేనె రంగులో కనిపిస్తాయి. ఇది
అంత విలువైన వైడూర్యంగా చెప్పరు. ప్లాష్ లైట్ వేసినపుడు పసుపు,
తేనెరంగుల్లో కనిపించేది బెస్ట్ క్వాలిటీగా చెప్పుకోవచ్చు.
వైడూర్యంలో దోషాలు:
కర్కరము: రాయి వలె కనిపించునవి
కర్కశము: గరుకుగా వున్నవి
త్రాసము: ముక్కలు ముక్కలుగా కనిపించునవి
దేహము: కాంతి లేకుండా వున్నవి.
కళంకము: నల్లని రంగులో వున్నవి
వైడూర్యం
అమర్చబడిన ఈజిప్టు దేశము ఆభరణములను బట్టి ఈ రత్నము ఆదేశపు చక్రవర్తులయిన
ఫెరోల కాలము నుండియు ఆ దేశమున వాడుకలో ఉన్నవని స్పష్టమగుచున్నది.
నలుపు, తెలుపు,
కలిసినది విప్రజాతి, వైడూర్యం, తెలుపు, ఎరుపు గలది క్షత్రియజాతి, ఆకుపచ్చ,
నలుపు కలిగినది వైశ్యజాతి, నలుపురంగు కలది శూద్రజాతి.
వైడూర్యమునాకు
సుతారము, ధనం అత్యచ్చము, కలిలము, వ్యంగ్యము అనే అయిదు శ్రేష్ఠ గుణములు
ఉన్నాయి. కాంతిని అధికంగా వెలువరించే దాని వలె నున్నది సుతారము, ఎక్కువ
బరువుగాను చూచుటకుచిన్నదిగాను ఉన్నది ధనము, కళంకము లేనిది అత్యచ్చము,
బ్రహ్మాస్త్ర కళాస్వరూపము గల్గి కనిపించునది కలిలము, స్పస్టముగా వేరుగా
కాన్పించు అవయవములు కలది వ్యంగ్యము అని చెప్పుదురు.
వైడూర్యమునకు ఇతర నామాలు:
ఏకసూత్రము, కేతుప్రియము, కైతనము, ఖరాబ్జాంకురము, వైడూర్యము, పిల్లి కన్నురాయి అనే పేర్లున్నాయి.
లక్షణాలు:
జాతి
- క్రైసోబెరిల్; రకాలు - సైమోఫెన్, క్రైసోబెరిల్, కాట్స్ ఐ, వ్యాపారనామం -
క్రైసోబెరిల్, క్యాట్స్ ఐ, దేశీయనామం - లసనియ, వైడూర్యం, కెత్తు,
జిడారక్స్, క్రైసోబెరిన్
రసాయన సమ్మేళనం:
Be, Al2O3
బెరీలియం ఆక్సైడ్; స్పటిక ఆకారం - ఆర్థోరాంబిక్; స్పటిక లక్షణం -
ట్యూబ్యులార్, సైక్లిన్ ట్విన్నింగ్: వర్ణం -పసుపు, ఆకుపచ్చ, బ్రౌన్ లేదా
వీటి సమ్మేళనం వర్ణం; కారణం - ఐరన్; మెరుపు - విట్రియన్; కఠినత్వము -8.5;
ధృడత్వము - ఎక్సలెంట్; సాంద్రత S.G – 3.71 నుండి 3.72; క్లీవేజ్ -
అస్పష్టంగా ఏక లేక ద్వికిరణ ప్రసారము (SR/DR)-DR; పగులు - శంకు ఆకృతి;
అంతర్గత మూలకాలు -నీడిల్స్, కెనాల్, చిన్నట్యూబ్లు, సమాంతరంగా మరియు నిలువు
అక్షాలలో ఉంటాయి. కాంతి పరావర్తన పట్టిక (R.I)-1.745-1.754; UV light –
జడం; సాదృశ్యాలు -క్వార్జ్, క్రోసిడోలైట్, అపటైట్,మరియు టుర్మలిన్,
క్యాట్స్ ఐ.
వైడూర్యము ధరించే పద్ధతి :
రత్నాలకు
గ్రహాలకు చాలా అవినాభావ సంభంధంఉంది. అదే విధంగా మానవ జీవితాలకు కూడా దగ్గర
సంభంధం ఉన్నది.జీవితంలో కలిగే కష్టసుఖాలు, వ్యాధిబాధలు, దుఃఖసంతోషాలకు,
గ్రహాలు మూల కారణమని జోతిష్యశాస్త్రం చెబుతుంది. ఈ మానవజీవితంలో కలిగే
వ్యతిరేక ఫలితాలనుండి తప్పుకొని పూర్తి శుభఫలితాలు పొందడానికి గ్రహశాంతులతో
బాటుగా రత్నములను ధరించే విధానాలు కుడా జ్యోతిశాస్త్ర పరమైనవే !
దోషరహితమైన
ఉత్తమజాతికి చెందిన ప్రకాశవంతమైన వైడూర్యము, బంగారం లేదా వెండితో లేదా
పంచలోహాలతో తయారు చేయ బడిన ఉంగరము నందు ఇమిడ్చి ధరించాలి ఉంగరము అడుగు భాగం
రంద్రమును కలిగి ఉండే విధంగా పైభాగం ద్వజాకారం లేదా వర్తుల, చతురస్రాకారము
గలిగిన పీఠమును ఏర్పరచి దాని మధ్యభాగంలో సూత్రం పైకి కనిపించే విధంగా
వైడూర్యమును బిగించి, శుద్దిగావించిన పిమ్మట శాస్త్రోక్తముగా షోడశోపచార
పూజలు నిర్వర్తించి శుభముహూర్తమున ధరించాలి కేతుగ్రహస్తమైన సూర్య
చంద్రగ్రహణములు సంభవించిన కాలంలో వైడూర్య రత్నాన్ని ఉంగరంలో బిగించడం చాలా
ఉత్తమం మరియు, మూలా, ఉత్తరాషాడ, ధనిష్ఠ అను నక్షత్రములచే కూడివచ్చిన
అమావాస్య ఆదివారం యందు గానీ మృగశిర 1-2 పాదములయందు గానీ, ఉత్తర నక్షత్రములు
గల సోమవారంగానీ శ్రావణమాసంలో శుక్లపంచమి, పూర్ణిమాతిదులయందుగానీ వర్జ్య
దుర్ముహుర్తములు లేకుండా చూచి రవి లేదా చంద్ర హోరాలు జరిగే సమయంలో వైడూర్య
ఉంగరమును బిగించాలి. ఆ తర్వాత దానిని ఒక దినమంతయు ఉలవ నీటియందుంచి, మరుసటి
రోజు పంచ గవ్యములందు, మూడవదినము తేనెను కలిపిన నీటియందు నిద్ర గావింపజేసి
శుద్ధోదకము చేత పంచామృతము చేత స్నానము గావింపజేసి ఆ ఉంగరమును
శాస్త్రోక్తవిధిగా ధూపదీప నైవేద్యములచే షోడశోపచార పూజలు గావింపజేసిన పిమ్మట
అనుకూలమైన శుభముహుర్తాన చేతికి ధరించవలెను.
కేతుపఞ్చవింశతినామస్తోత్రమ్
కేతుః కాలః కలయితా ధూమ్రకేతుర్వివర్ణకః|
లోకకేతుర్మహాకేతుః సర్వకేతుర్భయప్రదః|| ౧||
రౌద్రో రుద్రప్రియో రుద్రః క్రూరకర్మా సుగన్ధధృక్|
పలాశధూమసంకాశశ్చిత్రయజ్ఞోపవీతధృక్|| ౨||
తారాగణవిమర్దీ చ జైమినేయో గ్రహాధిపః|
పఞ్చవింశతినామాని కేతోర్యః సతతం పఠేత్|| ౩||
తస్య నశ్యతి బాధా చ సర్వకేతుప్రసాదతః|
ధనధాన్యపశూనాం చ భవేద్ వృద్ధిర్న సంశయః|| ౪||
ఇతి శ్రీస్కన్దపురాణే కేతోః పఞ్చవింశతినామస్తోత్రం సంపూర్ణమ్
కేతుకవచమ్
శ్రీగణేశాయ నమః|
కేతుం కరాలవదనం చిత్రవర్ణం కిరీటినమ్|
ప్రణమామి సదా కేతుం ధ్వజాకారం గ్రహేశ్వరమ్|| ౧||
చిత్రవర్ణః శిరః పాతు భాలం ధూమ్రసమద్యుతిః|
పాతు నేత్రే పిఙ్గలాక్షః శ్రుతీ మే రక్తలోచనః|| ౨||
ఘ్రాణం పాతు సువర్ణాభశ్చిబుకం సింహికాసుతః|
పాతు కణ్ఠం చ మే కేతుః స్కన్ధౌ పాతు గ్రహాధిపః|| ౩||
హస్తౌ పాతు సురశ్రేష్ఠః కుక్షిం పాతు మహాగ్రహః|
సింహాసనః కటిం పాతు మధ్యం పాతు మహాసురః|| ౪||
ఊరూ పాతు మహాశీర్షో జానునీ మేऽతికోపనః|
పాతు పాదౌ చ మే క్రూరః సర్వాఙ్గం నరపిఙ్గలః|| ౫||
య ఇదం కవచం దివ్యం సర్వరోగవినాశనమ్|
సర్వశత్రువినాశం చ ధారణాద్విజయీ భవేత్|| ౬||
|| ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే కేతుకవచం సమ్పూర్ణమ్||
No comments:
Post a Comment