జ్యోతిర్వైద్యం
ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్
ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్
పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణపీడితం
తచ్ఛాన్తి రేషధైర్థానై జపహోమ: సురార్చనై:
ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్
ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్
పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణపీడితం
తచ్ఛాన్తి రేషధైర్థానై జపహోమ: సురార్చనై:
తాత్పర్యం:
సకల ఐశ్వర్యములు ఈశ్వర ఆధీనం ,ఆరోగ్యం సూర్యుని ఆధీనం,పూర్వజన్మలో చేసిన పాపములు రోగములద్వారా అనుభవించవలసి ఉంటుంది.వీటిని రూపుమాపుటకు ఔషద సేవనం ,దానం జపం ,హోమం.సురార్చనము యోగ దాయకములు.
జ్యోతిర్వైద్యం అనే పదం ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.వైద్యజ్యోతిష్యం,జ్యోతిర్వైద్యం కొంత తేడాతో కనిపిస్తున్నాయి.రోగం వచ్చిన తర్వాత నివారించే విధానం వైద్యజ్యోతిష్యంలో కనిపిస్తుంది.రోగం వచ్చే అవకాశాలను జ్యోతిష్య సూత్రాల రిత్యా జాతకపరిశీలనా మాద్యమంగా దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రత్యేక సమయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ జీవనవిధానాన్ని మార్చుకునే విధానమే జ్యోతిర్వైద్యంగా చెప్పబడుతోంది.
ఉపనిషత్తులు కూడా శరీరమనే రధానికి ఆత్మరధి అని,బుద్ది సారధి అని,ముందున్న ఐదు గుర్రాలు పంచేంద్రియాలు,ఇంద్రియాలను అదుపులో ఉంచే పగ్గాలు మనస్సు.బుద్ది తన విశ్లేషణా శక్తితో,ఆత్మ యొక్క ఆదేశ మేరకు మనస్సును అదుపులో పెట్టుకుని ఇంద్రియాలనే గుర్రాలను జాగ్రత్తగా అధిలిస్తూ శరీరమనే రధాన్ని నడిపిస్తే జీవన లక్ష్యాన్ని గమ్యాన్ని సరైన సమయంలో సరియైన విధంగా చేరగలిగే అవకాశాన్ని ఇచ్చిన వారవుతాం..అందువల్ల మనస్సు అన్నింటికీ కీలకమైనది.
జ్యోతిష్యపరంగా మనోకారకుడైన వాడు చంద్రుడు అటువంటి చంద్ర గ్రహ సంబంధమైన జపం ధ్యానం చేయడంవల్ల జీవిత గమ్యం చేరగలుగుతాం..

No comments:
Post a Comment