Friday, 4 December 2020

శీఘ్రఫలదాయిని,సకల కోరికలను తీర్చే కల్పవల్లి. శత్రు సంహారిణి.....ధూమావతి



ఐశ్వర్య ప్రదాయిని, ధూమవతి. కొలిచిన వారికి కొంగు బంగారం....దారిద్ర్యాన్ని పోగొట్టి అమిత ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత ధూమావతి.జ్యేష్ట శుద్ధ అష్టమి ధూమావతి జయంతి.దశమహావిద్యలలో అతి విచిత్రమైన అవతారం ఇది.

ఈమె దేవతలలో వైధవ్య రూపిణిగా అగుపిస్తుంది.బూడిదరంగు ఆకృతి, మ్మసిన వస్త్రాలు, వేలాడే స్తనాలు,విరబోసిన జుట్టు, ఆకలి గొట్టు,రౌద్రపు చూపు, బాగా వ్రుద్దురాలిగా ఈమెని చూస్తాము.,

ధూమావతి అనే సంసృత పదానికి పొగపట్టినది, పొగగలది  అని అర్ధం.ఈ ధూమావతి పది తన్త్రదేవతైలైన  దశామహవిద్యలలో  ఒకటి. ధూమావతి పార్వతి దేవి యొక్క రుద్ర రూపం. చూడడానికి ఆమె ఒక వృద్ద వితతువులా కనిపిస్తూ కాకి చేత లేదా గుర్రం లేని బగ్గి పై ప్రయాణిస్తూ కనిపిస్తుంది.
ధూమవతి సిద్ధిని ప్రసాదించే తల్లి.

7వ మహా విద్య

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

శ్లోకం

అత్యుచ్చా మలినాంబరాఖిలజనోద్వేగావహా దుర్మనా
రూక్షాక్షి త్రితయా విశాలదశనా సూర్యోదరీ చంచలా|
ప్రస్వేదామ్బుచితా క్షుధాకులతను: కృష్ణా తిరూక్ష ప్రభా
ధ్యేయా ముక్త కచా సదాప్రియకలిర్ధూమావతీ మంత్రిణా|

యత్ర అగ్నిః తత్ర ధూమః – అవిద్య నుండి విద్యను, విద్యాతత్త్వాన్ని అనుభూతి చేయగలది ధూమావతి. మానవుని నిద్రా, నిద్రారాహిత్యాలు ధూమవతి యొక్కవైభవము
ధూమావతి అంటే ఉపాసనా పరంగా మహామౌనమని కూడా అర్థం. ఉపనిత్తులలో పేర్కొన్న భూమావిద్య. ఇది పూర్ణవిద్య మరియు అపూర్ణవిద్య కూడా – విద్యాఽవిద్యా స్వరూపిణి


లౌకికంగా ఆలోచిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముందు జ్యేష్టాదేవి కృపతో అలక్ష్మిని తొలగించికోవాలి, జ్యేష్టాదేవి దయ ఉంటేనే లక్ష్మీదేవి ప్రాసాదించే సంపద మనకు దక్కుతుంది. ధూమావతి మంత్రాలలో జ్యేష్టాదేవి మంత్రంకూడా వుంది. లోకంలో సంపద ఉంచాలన్నా తీసేయాలన్నా ఈమే కారణం.

ప్రళయ కాలానికి ముందు వెనుకలుగా ఆ తల్లి దర్శనమిస్తు ఉంటుంది.ధూమావతి మామూలుగా అపవిత్రాలకి ప్రతీకగా అనిపిస్తుంది కాని ఆ తల్లి సహస్ర నామాలు చూస్తే మనకి పవిత్రమైనవి మరియు అపవిత్రమైనవి రెండు కనిపిస్తాయి. ఆ తల్లి అత్యంత దయామయి మరియు శీఘ్రఫలదాయిని. సృష్టి రహస్యాలని తెలియచెప్పే కల్పవల్లి. మన ఊహలకి , భావాలకి వెలుపల ఉండే అసలు సిసలు రహస్యాలను ,అతీంద్రియ శక్తులను తెలియచేసేదే  మనకి పైకి కనిపించే ఈ అందవికార రూపానికి అర్ధం.
 ధూమావతి అతీంద్రియ శక్తులని ,సర్వ సిద్దులని ప్రసాదించగల శక్తిగల తల్లి.అన్ని కష్టాలనుండి విముక్తి ప్రసాదించి ,అత్యుత్తమ జ్ఞానమైన మోక్షంతో సహా సకల కోరికలను తీర్చే కల్పవల్లి. శత్రు సంహారిణి.

ధూమావతి దశమహావిద్యాలలో ఏడవది. గుహ్యతిగుహ్య ప్రకారం విష్ణువు యొక్క దశావతారాలు దశమహావిద్యలతో కలిసి అవతరించాయి. చేప అవతారమైన మత్స్యావతారం ధూమావతి నుండి అవతరించిందని చెబుతారు. ముoడమాలలో ధూమావతి నుండి వామనావతారం ఉద్భవించిందని చెబుతారు.  శక్త మహా భాగవత పురాణం లో దక్షుడి కూతురైన ,శివుడి మొదటి భార్య అయిన సతి నుండి దశమహావిద్యలు ఉద్భవించాయని అంటారు. శివుడిని దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞానికి ఆహ్వానిoచక పోవడం వలన ఆగ్రహించిన సతి మంటలలో దూకాలని నిర్ణయించుకున్నప్పుడు శివుడు పరిపరి వారిస్తాడు.ఆగ్రహ జ్వాలలలో మండుతున్న సతి అప్పుడు దశామహవిద్యలుగా అవతరిస్తుంది.ఆగ్నేయం లో అవతరించిన మూర్తియే ధూమావతి. దేవి భాగవత పురాణంలో మహావిద్యలు శాకంబరి దేవి 
అవతారాలుగా యోద్దవిద్యాలుగా చెప్పబడ్డారు.

శక్తి సంగమ తంత్రoలో సతి దక్షయజ్ఞంలో ఆగ్రహజ్వలలతో ఆత్మాహుతిచేసుకున్నప్పుడు నల్లటి భాదామయమైన పొగతో కూడిన ధూమావతిగా ఉద్భవించిందని చెప్పబడింది. దోమ్మవతి సతి యొక్క పరాభవ అవతారం.
ప్రణతోషిణి తంత్రంలో ధూమావతి అమ్మవారి యొక్క వితంతురూపం గురించి చెప్పబడింది.ఆకలితో ఉన్న సతి శివున్ని ఆహారం అడుగుతుంది.
ఎంత ఆహారం ఇచిన సతి ఆకలి చల్లారదు.ఆకలి ఆకలి అంటూనే ఉంటుంది. అప్పుడు శివుడు నన్ను తినమని చెప్తాడు.శివుడు కోపం తో సతిని అక్కడినుండి వెళ్ళిపొమ్మని చెప్తూ వితంతువుగా జీవించమని శపిస్తాడు. 
ఇంకో కథనం ప్రకారం శంభ నిశుమ్భులతోయుద్ధం జరుగుతున్నప్పుడు దుర్గాదేవి దూమవతిని ఉద్భావిమ్పచేస్తుంది.
ధూమావతి అసలు అర్ధం పొగతో నిండినది, పోగపట్టినది.పొగ వదిలివెళ్లి పోయేటట్లు శత్రువులను మనలను వదిలిపోయేటట్లు చేయగలదు. 
.ప్రణతోషిణి తంత్రం ప్రకారం ఆమె లోని ఆకలి విద్వంసక కారకం కేవలం శివుని మింగితేనే లేదా సృష్టి కి ప్రతిసృష్టి చేస్తేనే ఉపశామిస్తుంది.ఈమె తన అననుకూలమైన విధవరాలి స్థితినిభర్త శివుని పైనే ప్రకటిస్తుంది.

గణపతి ముని " విశ్వోచ్చాటన కామోధూమావతి ముపాసిత"  అని పేర్కొన్నారు అనేతే మొత్తం విశ్వాన్ని ఉచ్చాటన చేయగలిగిన శక్తి ఈ దేవతకి ఉంది అని.

ఎంతటి శత్రువునైన పలాయనం చిత్తగించాగాలిగిన శక్తి ధూమావతి తంత్రం లో ఉంది.అంతే కాదు పిచ్చి , మూర్చ, కాన్సర్లు, మెదడు కణితి,పక్షవాతం, కీళ్ళనొప్పులు లాంటి భయంకర వ్యాధులు దూరం చేయగలదు.ఒక్క మాటలో చెప్పాలి అంటే సర్వ దుఖ నివారిణి.


ధూమావతి గాయత్రి:
ఓం దూమావత్యైచ విద్మహే సంహారిన్యైచ ధీమహి  తన్నో ధూమ ప్రచోదయాత్

ధూమావతి మంత్రం:
ఓం ధూమ్ ధూమ్ దూమవత్యై స్వాహాః

ధూమావతి యజ్ఞం చేసే చోట కాకులు విరివిగా వస్తాయి. ఇవి భక్తులు కొంత మందికి కలిగిన ప్రత్యక్ష అనుభవం.ఈ దేవిని మనం నలుపు వస్త్రాలు ధరించిప్రార్ధించాలి. ఈ మే ఉచ్చ్తన దేవత కనుక అపసవ్య దిశలో ప్రార్ధించాలి. అంటే ఐశ్వర్యం ఇవ్వమని కాక దారిద్ర్యన్ని ప్తోలగించమని ప్రార్ధించాలి.
ఏ కోరిక అయిన ఇలాగే కోరుకోవాలి.ఈ దేవత  హోమాన్ని ,జపాన్ని నిర్జన ప్రదేశంలో, స్మశానానికి దగ్గరలో లేదా పాడుబడ్డ ప్రదేశాలలో, నెమళ్ళు సంచరించే వనాలలో చెయ్యాలి.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


 




No comments:

Post a Comment