శుక్రుడు కళత్రము అంటే భార్య లేక జీవిత భాగస్వామి అని అర్ధం. పురుషుల జాతకచక్రములోన నవగ్రహములలో శుక్రుడు భార్యను సూచిస్తాడు. శుక్రుడిని కళత్రకారకుడు అని పిలుస్తారు. ఇక పురుషుని జాతకచక్రంలోని 12 స్థానాలలో 7వ స్థానాన్ని (సెవెంత్ హౌస్) కళత్రస్థానం అని పిలుస్తారు.
జాతకంలోని 7వస్థానంలో స్థితిపొందిన చెడుగ్రహం వలన కళత్రస్థానం దెబ్బతింటుంది. జాతకచక్రంలోని 7వస్థానము మరియు శుక్రుడు (శుక్రుడు ఏ స్థానంలో ఉన్నప్పటికీ) అశుభ స్థితిలో ఉన్నట్లయితే ఆ జాతకునికి కళత్రదోషం ఏర్పడుతుంది. కళత్రదోషం ఏర్పడటం వలన జాతకునికి వివాహం ఆలస్యం అవుతుంది. మరియు సరైన భార్య లభించటం దాదాపు అసాధ్యం అయిపోతుంది.
ఒకవేళ విధివశాత్తు ఆ జాతకుడికి వివాహం జరిగినా వివాహం జరిగిన కొద్ది రోజులలోనే భార్యతో విభేదాలు తలఎత్తి విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కళత్రదోషం ఉన్నవారికి సరి అయిన సంసారం సుఖం లభించదనే చెప్పాలి. కొన్ని కొన్ని జాతకాలలో కళత్రదోషం ఉన్నపుడు భార్య తరచు అనారోగ్యంపాలు కావటం లేదా అకాల మృతి పొందటం జరుగుతుంది. కళత్రదోషం ఉన్నపుడు ఈ క్రింద పేర్కొన్న పరిస్థితులు ఏర్పడతాయి. వివాహం ఆలస్యం విచారపూరితమైన దాంపత్య జీవితం ఉండటం, భార్యతో తరచుగా అపార్గాలు రావటం. దాంపత్యసుఖం లేకపోవటం, భార్యకు దూరంగా ఉండటం లేదా విడిపోవటం. భార్య అకాలమృతి పాలకావటం, కుజుడు కి కుజగ్రహం పురుషునియొక్క జాతక చక్రంలోని 7వస్థానంలో ఉంటే కళత్రదోషం ఏర్పడుతుంది. కేవలము శుక్రుడు మరియు కుజుడు మాత్రమే కాక కొన్ని ఇతర గ్రహాలు కూడా కళత్ర దోషాన్ని కలిగిస్తాయి.
శని :
ఒక పురుషునియొక్క జాతక చక్రంలో 7వ స్థానంలో శని ఉంటే కళత్ర దోషం ఏర్పడుతుంది. దీనినే శనిదోషం అనికూడా పిలుస్తారు. ఈ శనిదోషం వల్ల జాతకులకు వివాహం ఆలస్యం అవటమే కాకుండా కనీసం 30 సంవత్సరాల వయస్సు దాటిన తరువాతే ఈ జాతకులకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది. శనిదోషానికి తోడుగా శనిమీద ఇతర పాప గ్రహాల దృష్టి పడినట్లయితే ఆ జాతకుడు తనకన్నా చాలా పెద్దదయిన స్త్రీని వివాహం ఆడతాడు. ఆ దంపతులమధ్య వయస్సు తేడా 8 వసంవత్సరాలకన్నా ఎక్కువ ఉంటుంది. శనిదోషం ఉన్న పురుషులకు ఆలస్యంగా వివాహం జరగటమే కాకుండా భార్య నలుపు రంగులో ఉండటంకాని, సంపదలోకాని, సాంఘిక స్థాయిలోకాని జాతకుడి కన్నా చాలా తక్కువస్థాయిలో ఉంటుంది. ఈడుజోడు కుదరని జంట అయిన కారణంగా ఆ దంపతులమధ్య నిజమైన ప్రేమాభి మానాలు ఉండవు. రాహువు/కేతువు : జాతకునియొక్క జాతకంలోని 7వస్తానంలో రాహువు లేదా కేతువు ఉన్నట్లయితే కళత్రదోషం ఏర్పడుతుంది. ఫలితంగా వివాహం కావటం కష్టం అవుతుంది. వివాహం అయిన తరువాత వైవాహిక జీవితం దౌర్భాగ్యంగా ఉంటుంది. కేతువు లేదా రాహువు కారణంగా ఏర్పడే కళత్ర దోషాన్ని నాగ దోషం అనికూడా పిలుస్తారు.మరిదీనికి పరిష్కారము లేదా ఉంది, దోషము కలిగించే గ్రహాలకి పరిహారము, సర్పదోశానికి నాగప్రతిష్ట, యోగకారక గ్రహాల రత్నము ధరించడం, వంటివి చాలావరకు మేలుచేస్తాయి. అవగాహన, ప్రణాలికలు దాంపత్యములో సమస్యల్ని పోగొడుతుంది.
కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు చేసుకునే యువకుల జాతకాలలో కళత్రదోషం ఉన్నా ఆ దోషంయొక్క తీవ్రత ఈరకమైన వివాహాల కారణంగా చాలావరకు తొలగిపోతుంది. ఎందుకంటే ఆ సమస్యలు మరో రూపంలో అనుభవిస్తారు.
మరిన్ని వివరాలకు, మీ వ్యక్తిగత జాతకంలో దోషాల కొరకు వారియు వాటి పరిహారాల కొరకు సంప్రది0చండి.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment