గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు, పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది.
యోగ సంస్కృతిలో ఏ ఆధ్యాత్మిక సాధకుడి జీవితంలోనైనా బుద్ధ పౌర్ణమి చాలా ప్రధానమైన రోజు.
గౌతమ బుద్ధుడు ఈ భూమిపై అవతరించిన రోజు, జ్ఞానోదయమైన రోజుగా బుద్ధ పౌర్ణమి గుర్తింపు పొందింది. ఉత్తరాయణంలో వచ్చే ఈ మూడో పౌర్ణమికి గౌతమ బుద్ధుడి జ్ఞాపకార్ధం ఆయన పేరు పెట్టుకున్నాం. సుమారు ఎనిమిదేళ్లు కఠోర సాధన చేసిన గౌతముడు శారీరకంగా చాలా నీరసించి పోయారు. నాలుగేళ్ల పాాటు ఆయన ‘సమాన’ అనే సాధనలో ఉన్నారు. ‘సమాన’ సాధన అంటే ఆహారాన్ని అపేక్షించకుండా కేవలం ఉపవాసం, నడవటం.ఈ సాధన ఆయన శరీరాన్ని దాదాపు మరణానికి దగ్గరయేంతగా శుష్కింపజేసింది. ఆయన అలానడుస్తూ, 'నిరంజన’ అనే నది వద్దకు వెళ్లారు. ప్రస్తుతం భారతదేశంలోని చాలా నదుల్లా, అది కూడా అంతరించి పోయింది. అప్పట్లో ఈ నది మోకాలి లోతు నీరుతో, ఒక పెద్దపాయలా, వేగంగా ప్రవాహిస్తోంది. ఆ నదిని దాటడానికి ఆయన ప్రయత్నించారు. కానీ ఆయన శరీరం ఎంత నీరసించి పోయిందంటే నది మధ్యలోకి వెళ్ళాక ఆయన మరొక్క అడుగు కూడా వేయ లేకపోయారు. అంత తేలికగా వదలే మనిషి కాదు కాబట్టి, ఆయన అక్కడున్న ఒక పెద్ద ఎండుకొమ్మని పట్టుకుని అలా నిలబడ్డారు.
‘నాకు పరమోన్నత స్థితి ప్రాప్తమయ్యే వరకూ నేను ఇక్కడి నుంచి కదలను! ఆత్మ సాక్షత్కారమైన జ్ఞానిగా లేచి నిలబడాలి లేదా ఇలానే దేహం వీడాలి’ అనుకుంటూ గంటల తరబడి నిలబడ్డారని చెబుతారు. అసలు ఆయన గంటల కొద్దీ నిలబడ్డారో లేదా నీరసించిన స్థితిలో కొన్ని క్షణాలే ఆయనకు గంటలుగా అనిపించాయో మనకి తెలియదు. కానీ ఆ క్షణంలో ‘తాను దేని కోసమైతే పరితపిస్తున్నారో అది తనలోనే ఉంది!’ అనే విషయం మహాత్ముడు గ్రహించారు.
‘ఈ శ్రమంతా ఎందుకు? కావాల్సింది సంపూర్ణమైన అంగీకారం, అంతే. నేను శోధిస్తున్నది నా లోపలే ఉంది. నేను ప్రపంచమంతా ఎందుకు వెతుకుతున్నాను?’ అనుకున్నారు. ఇలా అనిపించాక ఆయనకు మరో అడుగు వేయటానికి ఇంకాస్త శక్తి వచ్చింది. ఆ నదిని దాటి, ప్రఖ్యాతి గాంచిన బోధివృక్షం కింద కూర్చున్నారు. ఎంతో ‘దృడ నిశ్చయంతో నాకు పరమోన్నత స్థితి ప్రాప్తమయ్యే వరకూ నేను ఇక్కడి నుంచి కదలను! నేను ఆత్మ సాక్షత్కారమైన జ్ఞానిగా లేచి నిలబడాలి లేదా ఇలానే చనిపోవాలి!’ అని నిశ్చయించుకున్నారు. ఆ మరుక్షణమే ఆయన ఆ స్థితికి చేరగలిగారు.

జ్ఞానోదయం పొందాలంటే మనం జీవితంలో కోరుకునేది అదొక్కటే కావాలి. అప్పుడు అది క్షణంలో జరిగిపోతుంది. మన సాధన, ప్రయత్నం అంతా మనకి అటువంటి ప్రాధాన్యత ఏర్పడటం కోసమే. మనుషులందరికీ ఎన్నో ప్రాధాన్యతలుంటాయి. అందువల్ల వారి మనస్సు, భావోద్వేగాలు, శక్తి అంతటా విస్తరించి ఉంటాయి. వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి సాధన చేయడానికి ఎంతో సమయం పడుతుంది. కాబట్టి, మొదట చేయాల్సింది మనల్ని మనం ఒక్క చోటుకి సమీకరించుకోవడం. అంటే మనల్ని మనం ఒకే దిశ వైపు మాత్రమే మళ్లించుకోవడం. ఒక మనిషి తనను తాను సంపూర్ణంగా ఒక్క చోటుకి సమీకరించుకున్నప్పుడు మాత్రమే, అతనికి మేము ఏదైనా చేయడం సాధ్యమవుతుంది.
‘సమాన’ గా గౌతమ బుద్ధుడి సాధనలోని తీవ్రతను చూసి ఎన్నో ఏళ్లు ఉన్న ఐదుగురు తోటి సాధకులు ఆయనను మార్గదర్శకునిగా తీసుకున్నారు. కానీ ఆయన ధ్యాన స్థితిలో నుంచి లేచిన తర్వాత మొదట ‘మనందరం భోజనం చేద్దాం’ అన్నారు. దీంతో వాళ్లు నిర్ఘాంతపోయి.. బుద్ధుడి సాధన దిగజారి పొయిందనుకుని, పూర్తిగా నిరుత్సాహపడ్డారు. వారి భావాలను గ్రహించిన గౌతముడు.. ‘మీకు అసలు విషయం తెలియడం లేదు. ఇది ఉపవాసం గురించి కాదు, ఇది ఙ్ఞానోదయం గురించి.. నాకు పూర్ణ ఙ్ఞానోదయం కలిగింది.. నన్ను గమనించండి. నా లోని ఈ మార్పును చూడండి. నాతో కేవలం అలా ఉండిపోండి, అంతే’ అన్నారు.
అయితే, వారంతా గౌతముడిని వదిలి వెళ్లిపోయినా... వారిపై ఉన్న కారుణ్యం వల్ల బుద్దుడు వారిని వెతుక్కుంటూ వెళ్లి జ్ఞానోదయం వైపు నడిపించారు. ఙ్ఞానులు చాలా మంది ఉండవచ్చు. కానీ, ఈ అద్భుతమైన మనిషి ప్రపంచపు రూపు రేఖలను ఎన్నో విధాలుగా మార్చి, 2,500 ఏళ్లు గడిచినా ఇంకా ఈ నాటికి కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నారు.

ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/CDRK2zFOhgI1rQfgnRJTbf
https://chat.whatsapp.com/B57snQO4QZ7KI1EH7p2qi5
https://chat.whatsapp.com/IYnMoI7TGw9Fn6llPK8UDX
https://chat.whatsapp.com/GeMshZzoZhB5ACUXTVW5Jy
https://chat.whatsapp.com/KDkvpAHTyUSCYapVgsHGiv
https://chat.whatsapp.com/GMBYOVwRj8MDJtJKFboSkm
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Gq72L3u0mNf4zkkiEcpG9y
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Br5vhG7L4L8HhQ1uUWldui
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/GMBYOVwRj8MDJtJKFboSkm
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment