కొన్ని సార్లు ఎంత కష్టపడినా ఫలితం రాదు. నైరాశ్యం వల్ల ఏ పనిపై దృష్టి పెట్టరు. ఈ విధంగా మీ జీవితలోనూ జరుగుతున్నట్లయితే కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ఇవి మీ జీవితంలో సానుకూలతను పెంపొందించడానికి కచ్చితంగా సహాయపడతాయి.
నలుపు దారంతో పరిహారం..
మార్కెట్ ను నలుపు రంగు దారాన్ని కొనుగులు చేయండి. మీ వయస్సుకు సమానమైన ముడులను దానిపై కట్టండి. అనంతరం అరటి, తులరి ఆకుల రసాన్ని ప్రతి ముడిపై వేయండి. ఆ తర్వాత పసుపు, సింధూరాన్ని దారానికి రాయండి. అనంతరం ఆ దారాన్ని కుడి చేతికి కిందగా ఉండేట్లు ధరించండి. ఈ విధంగా ఆ దారాన్ని 21 రోజుల పాటు ధరించాలి. ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న నిరాశ తొలుగి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
ఈ మంత్రాలను జపించండి..
శాస్త్రాల్లో గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రాలు విజయాక్షరాలుగా పరిగణిస్తారు. రోజూ ఈ మంత్రాలను కనీసం 31 సార్లు జపించాలి. ఇలా చేయడం ద్వారా గాయత్రి మాత, పరమేశ్వరుని ఆశీర్వాదం పొందుతారు. ఫలితంగా ప్రతికూల కర్మలు మీ నుంచి దూరమవుతాయి. మీరు ఏ పని చేపట్టిన అందులో విజయం సాధిస్తారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత పొందుతారు.
రొట్టెతో పరిహారం..
మీరు ఇంటి నుంచి ఏదైనా అత్యవసర పని మీద బయటకు వెళ్లే ముందు గోధుమపిండితో తయారు చేసిన తాజా రొట్టెను మీతో పాటు తీసుకొని వెళ్లండి. మార్గం మధ్యలో కాకులు కనిపిస్తే రొట్టెను ముక్కలుగా చేసి వాటికి తినిపించండి. ఇలా చేయడం ద్వారా మీరు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు అనుకూల సమయానికి పూర్తి కావడమే కాకుండా అందులో మీరు విజయం సాధిస్తారు.
విఘ్నేశ్వరుని నామం స్మరించండి..
మీరు ఇంటి నుంచి కొన్ని శుభకార్యాలకు వెళ్తుంటే మీరు ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. అప్పుడు మీరు కచ్చితంగా విజయం సాధించవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఇంటి నుంచి బయల్దేరే ముందు శ్రీ గణేశాయ అనే మంత్రాన్ని జపించండి. అనంతరం వ్యతిరేక దిశలో నాలుగు అడుగులు వెనక్కి వేసి అనంతరం మీ పని కోసం వెళ్లండి. ఈ పరిహారం పాటించడం ద్వారా మీరు విజయం సాధించడమే కాకుండా ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది.
ప్రతి ఆదివారం ఈ పని చేయండి..
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment