Tuesday, 11 May 2021

వైశాఖమాసం విశిష్టత చెయ్యాల్సిన దానాలు:

...

వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి. వైశాఖము,
మాఘము, కార్తికము – ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా
చెప్తారు. ఏవిధంగా అయితే కార్తిక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా
వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం
పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది. సాధనా మాసంగా దీనిని
నిర్వచించవచ్చు. వసంతఋతువులో రెండవ మాసం ఇది. దీనికి వైదిక నామం
మాధవ నామము. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసాన్ని అంటారు.
వైశాఖమాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది.
వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు.
వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా
అనునిత్యం నారాయణుని తులసితో ఆరాధించడం చేయాలి. ఆ తులసి కూడా
కృష్ణ తులసి సమర్పిస్తే శ్రేష్టం అని ధర్మశాస్త్రం చెప్తున్నది.
విష్ణుసహస్రనామ పారాయణ వైశాఖం అంతా చాలా ప్రశస్తమైనటువంటిది.
అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం,
వైశాఖం అంతా చేసినట్లయితే అభీష్టసిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి
చెందుతారు.
గళంతిక ఆరాధన – శివునకు ఈ మాసమంతా అభిషేకం చేస్తే చాలా ప్రసిద్ధి. అ
నునిత్యం శివారాధన అభిషేకంతో చేయాలి. అది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక
తాపత్రయాలను తొలగించి మనశ్శాంతినిస్తుంది. అందుకు శాంతి కోసం శివునికి
అభిషేకం చేస్తారు. శివాలయాలలో శివునకు పైన గళంతికను ఏర్పాటు చేయడం
కూడా చాలా మంచిది. దీనినే దారాపాత్ర అంటారు. నిరంతరం శివుడి మీద ధార
పడేటట్లుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి. ఇలా నెలంతా శివునిపై ధార పడేటట్లు
చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని
ధర్మశాస్త్రములు చెప్తున్న విషయం.
’వైశాఖే మాధవో, రాధో’
వైశాఖమాసాన్ని ’మాధవామాసం’ అని అంటారు. ఈ మాసంలో విష్ణుస్మరణతో,
అభీష్ట దేవతారాధనతో నియమపాలన చేయడం ఇహ పర శ్రేయస్సునిస్తుందని
పురాణాలు చెప్తున్నాయి. వైశాఖమాసాన్ని మహిమాన్వితమైన దివ్యమాసంగా
శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతః కాలాన లేచి మధుసూదనుని స్మరిస్తూ
స్నానం చేయడం విశేష ఫలప్రదం.
ప్రాతః సనియమ స్నాన్యే ప్రీయతాం మధుసూదనః!
అదే విధంలో
"మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన
ప్రాతః స్నానేన మే నాథ ఫలదోభవ పాపహన్!! -
అనే ప్రార్థనతో తీర్థాదులలో చేసిన స్నానం దివ్యఫలాన్నిస్తుంది.
తులసీ కృష్ణ గౌరాభ్యాం తయాభ్యర్చ్య మధుద్విషమ్!
విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్!!
మాధవం సకలం మాసం తులస్యాయోర్చయే న్నరః!
త్రిసంధ్యం మధుహంతారం తస్యనాస్తి పునర్భవః!!
వైశాఖమాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించితే శ్రేష్ఠం.
ప్రాతః స్నానానంతరం అధికజలంతో అశ్వత్థ (రావి) వృక్షపు మూలాన్ని తడిపి
ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు.
ఈ మాసంలో ఒంటిపూట భోజనం లేదా నక్తం (పగలంతా ఉపవసించి రాత్రి
ప్రారంభంలో భుజించడం) ఆచరించడం మంచిది.
ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలని
నిర్వహించడం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయడం
పుణ్యఫలాన్నిస్తుంది.

‘‘వైశాఖ మాస శుక్ల తృతీయా- అక్షయ తృతీయోచ్ఛతే’’ అని శాస్త్ర వచనం.
అనగా వైశాఖ శుద్ధ తృతీయ ‘అక్షయ తృతీయ’యనబడుతుంది.

వైశాఖ మాసంలో వచ్చే ఈ రోజు వైదిక కాలమానం ఖగోళ శాస్త్ర, జ్యోతిష శాస్త్రాల
ననుసరించి సూర్యచంద్రులు శక్తివంతమైన స్థానాల్లో వుండి ప్రకాశవంతముగా
వెలిగిపోతూంటారనీ, సూర్యుని జీవానికి, చంద్రుడిని మేధస్సుకు అధిదేవతగా
భావించే మన హిందూ సంప్రదాయంలో ప్రకృతి రమణీయతతోపాటు, సూర్యుని
తీవ్ర ఉష్ణ ప్రభావం కుటుంబీకులకు అంటకుండా అనగా తగలకుండా క్షేమంగా
సూర్యునికి నమస్కరించే విధానమే అక్షయ తృతీయ. ఈ రోజున చేసే పూజలు
హోమము- దానము- పితృతర్పణము అక్షయమైన పుణ్యఫలాన్ని యిస్తాయి.
కావున యిది అక్షయ తృతీయగా పిలువబడుతుంది. ఈ రోజున గంగా స్నానం-
యవల ధాన్యంతో వండిన భోజనం, యవలతో చేసే హోమం సర్వ శ్రేష్టము.
సకల పాపహారం.

ఒక్కో మాసంలో వచ్చే తదియకు ప్రత్యేక పేర్లున్నాయి అని పండితుల అభిప్రాయం.
చైత్రంలో వచ్చే తదియకు ‘డోలావ్రత’ తదియయని, వైశాఖ మాసంలో వచ్చే
తదియను ‘రంభాతదియ’యనీ అంటారు. ఈ రోజుల్లో మహిళలు ఆచరించే పూజలు
వ్రతాలు విశేష పుణ్యఫలాన్ని యిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.అక్షయ తృతీయ
రోజున కొంచెం బంగారాన్ని కొన్నా అది సంవత్సరమంతా ఆ వ్యక్తికి సంపదనూ,
సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గల భక్తుల దృఢ విశ్వాసం.
వైశాఖమాసం అనేక విశేషాలకు వేదికగా కనిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ మాసంలో నదీ స్నానాలు ... శక్తి కొద్ది దానాలు అనంతమైన ఫలితాలను అందిస్తాయని అంటున్నాయి. దాంతో ఎవరి స్థాయిలో వాళ్లు దానధర్మాలు చేయడానికి ముందుకు
వస్తుంటారు. అయితే ఏదిపడితే అది దానం చేయడం వలన ఆశించిన ఫలితాన్ని
అందుకోవడానికి సమయం పడుతుంది.

అదే .. దానాన్ని గ్రహించిన వాళ్లకి ఆ దానం వలన వెంటనే ఉపయోగం వుంటే, చేసినవారికి అంతే త్వరగా ఫలితం కనిపిస్తుంది. ఇలా ఆశించిన ఫలితాన్ని త్వరగా పొందాలనుకుంటే, దానం చేసే వాళ్లు ఆయా కాలాలాను బట్టి ... అవసరాలను బట్టి దానం చేయవలసి వుంటుంది. అలా వైశాఖ మాసం విషయానికి వచ్చే సరికి, ఈ మాసంలో ఎండలు విపరీతంగా వుంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక సాధారణ ప్రజలు నానాఅవస్థలు పడుతుంటారు.

అలాంటి వారికి 'చలివేంద్రాలు' ద్వారా మంచినీటి దానం చేస్తూ వారి దాహార్తిని
తీర్చాలి. అంతే కాకుండా వేసవి కాలపు ఎండలను తట్టుకునే విధంగా గొడుగులు ...
పాదరక్షలు ... విసన కర్రలు ... దానం చేయవలసి వుంటుంది. ఇవి తక్కువ ఖర్చుతో
వీలైనంత ఎక్కువమందికి దానంగా అందించే అవకాశం వుంటుంది. ఎండవేడిమి
నుంచి తక్షణమే ప్రజలకు ఉపశమనాన్ని అందించినట్టు అవుతుంది. ఈ విధంగా
తక్షణమే ప్రయోజనాన్ని కలిగించే దానాలను వైశాఖ మాసంలో చేయడం వలన సకల
శుభాలు చేకూరతాయనీ, ఉత్తమగతులు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.ఈ రోజున
గొడుగులు - చెప్పులు- గోవు- భూమి- బంగారం- వస్త్రాలు- నీరు నిండిన ఘటం దానం
చేస్తే పుణ్యమని శాస్త్రం.

........
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............
.........

.............

No comments:

Post a Comment