మేషం..
అంగారకుడు, శని రెండూ గ్రహాలు ఒకదానికొకటి శత్రువులుగా పరిగణిస్తారు. అంగారకుడు మేష రాశికి అధిపతి కావడంతో శని తిరోగమన ప్రభావం ఈ రాశిపై అధికంగా ఉంటుంది. వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మకరంలో శని తిరోగమనం వల్ల కుటుంబంలో వివాదాలు, మనస్పర్థలు తలెత్తే అవకాశముంది. ఈ సమయంలో మీ ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇందుకు పరిహారంగా ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించాలి.
వృషభం..
మీ రాశిలో 9వ పాదంలో శని తిరోగమనం సంభవించనుంది. ఈ సమయంలో మీ తండ్రితో సంబంధంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మాటలను నియంత్రణలో ఉంచుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై అంతగా ఆసక్తి చూపించరు. ఈ సమయంలో అదృష్టంపై ఆధారపడకుండా చేపట్టిన పనులు, వ్యవహారాలను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇందుకోసం మీరు బాగా కష్టపడాలి. విజయం సులభంగా దొరకదు.
మిథునం.
మీ రాశి నుంచి 9వ పాదంలో శని తిరోగమించనున్నాడు. ఈ సమయంలో శని దేవుడు మీకు సవాళ్లను ఇవ్వవచ్చు. ఈ సమయంలో మీరు మీ అత్తమామలతో ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. స్పేస్ సైన్ చదువుకునేవారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శని తిరోగమనం సమయంలో తెలియని భయం మిమ్మల్ని కలవరపెడుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండంట మంచిది.
కర్కాటకం..
మీ రాశి నుంచి శని ఏడో పాదంలో తిరోగమించనుంది. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశముంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. నమ్మకంగా ఉన్న వారే మోసం చేసే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సామాజిక కార్యాలు చేయడం వల్ల శుభఫలితాలను పొందవచ్చు. ఈ సమయంలో మీ కీర్తి పెరుగుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
సింహం..
సింహ రాశి వారికి శని తిరోగమనం వల్ల నూతన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని, సూర్యుడికి మధ్య శత్రు సంబంధం ఉండటం వల్ల సింహ రాశి వారికి అంత అనుకూలంగా ఉండదు. మీ రాశి నుంచి ఆరో పాదంలో శని తిరోగమించడం వల్ల ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ఈ సమయంలో పనిప్రదేశంలో మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ధైర్యాన్ని నిలకడగా ఉంచుకునేందుకు ధ్యానం చేయండి.
కన్య..
కొన్ని సందర్భాల్లో శని తిరోగమనం మీ రాశిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మీరు పిల్లలపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. అంతేకాకుండా పెద్దలను గౌరవించాలి. ఆర్థిక విషయాల్లో ఈ సమయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులో డబ్బులు పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. లేకుంటే నష్టాలు వచ్చే అవకాశముంది. అనారోగ్య కారణంగా ఈ సమయంలో మీకు ఒత్తిడి కలుగుతుంది. కరోనా సంక్రమణను నివారించండి. మంచి ఆహారం తీసుకోండి. ఆకుపచ్చ లేదా నీలం రంగు బాటిల్ తో నీరు తాగండి. శని ప్రభావం పడకుండా ఉండేందుకు లక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి.
తుల..
శని తిరోగమనం సమయంలో మీ రాశి వారికి వైవాహిక జీవితంలో ఆనందం కొరవడుతుంది. ఈ సమయంలో దేవునిపై విశ్వాసం అధిగమవుతుంది. పెద్దలను గౌరవించాలి. అంతేకాకుండా మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడపాలి. పనిప్రదేశంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీ సీనియర్లు, సహచరులను గౌరవించండి. కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు. తేలికపాటి ఆహారం తీసుకుంటే మంచిది. ఎలాంటి ధూమపానం, మద్యపానం చేయకండి. వాటికి దూరంగా ఉండాలి.
వృశ్చికం..
అంగారకుడు అధిపతిగా ఉన్న మరో రాశి వృశ్చికం. శని తిరోగమనం వల్ల వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల్లో వివాదం పెరుగుతుంది. సమస్యలను విచ్ఛిన్నచేయడానికి బదులు విస్మరించడం మంచిది. ముఖ్యంగా మీ కంటే చిన్న తోబుట్టువుల మాటలను పట్టించుకోవద్దు. ఆర్థిక పరంగా ఈ సమయంలో కొన్ని చిక్కులు ఉంటాయి. ఈ సారి డబ్బు ఆదా చేసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబంలో పెద్ద వారికి పూర్తి గౌరవం ఇవ్వండి. అనారోగ్యం విషయంలో వైద్యుడి సలహా తీసుకోండి. మిడి మిడి జ్ఞానంతో ఉన్న వారితో వాదించకండి.
ధనస్సు..
ఏలిననాటి శని ప్రభావం మీకు చివరి దశలో ఉంది. కాబట్టి మీరు ఈ సమయంలో పెద్ద నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఏదేమైనా ఈ సమయంలో నూతన కార్యాలు ప్రారంభించకండి. శని తిరోగమనం కాబట్టి ఈ సమయంలో అనవసర ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. డబ్బును సరైన సమయంలో ఉపయోగించాలి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండటం వల్ల మీకు భారంగా అనిపిస్తుంది. కాబట్టి భారంగా ఉండే పనులు ఏవి చేయకుండా ఉంటే మంచిది. ఇందుకు పరిష్కారంగా కుడిచేతిలో రక్షసూత్రం ధరించండి. అలాగే ప్రతి శనివారం శని ఆలయాన్ని సందర్శించండి.
మకరం..
మీ రాశి నుంచి శని 12వ పాదంలో తిరోగమించనున్నాడు. ఈ సమయంలో అమ్మకాలు, కొనుగోళ్ల సమయాల్లో డబ్బు కోల్పోయే అవకాశముంది. అంతేకాకుండా ఈ సమయంలో మంచి బడ్జెట్ ప్రణాళికను రూపొందించాలి. విదేశాల్లో పనిచేసే వారు ఈ సమయంలో ప్రయోజనం అందుకుంటారు. అంతేకాకుండా బెట్టింగ్, జూదం మొదలైన వాటికి దూరంగా ఉండటం మంచిది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.
మీనం..
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment