జనవరి 2, 2021 : సంకష్ట చతుర్థి..
జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం జరుపుకున్న మరుసటి రోజే అంటే జనవరి 2వ తేదీన శనివారం నాడు సంకష్ట చతుర్థి ఉపవాసాన్ని పాటిస్తారు చాలా మంది హిందువులు. ప్రతినెలా క్రిష్ణ పక్ష చతుర్థి రోజున సంకష్ట చతుర్థి ఉపవాసం పాటిస్తారు. ఈ సమయంలో వినాయకుడిని పూజిస్తారు.
జనవరి 9, 2021 : సఫాలా ఏకాదశి..
2021 సంవత్సరంలో తొలి సఫాలా ఏకాదశి రోజున చాలా మంది ఉపవాసం పాటిస్తారు. ప్రతి మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫాలా ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తారు.
జనవరి 10, 2021 : ప్రదోష్ వ్రతం..
జనవరి 10, 2021న ఆదివారం రోజున క్రిష్ణ ప్రదోష్ వ్రతం పాటించనున్నారు. ఈ పర్వదినాన చాలా మంది ఆ పరమేశ్వరుడిని కొలుస్తారు. ఆ దేవుని ఆశీర్వాదం పొందేందుకు ప్రదోష్ వ్రతాన్ని నిర్వహిస్తారు.
జనవరి 11, 2021 : మాస శివరాత్రి..
హిందూ పంచాంగం ప్రకారం, క్రిష్ణ పక్షంలోని చతుర్దశిలో ప్రతి మాసంలోనూ శివరాత్రిని జరుపుకుంటారు. ముఖ్యంగా జనవరి నెలలో, మాస శివరాత్రి రోజున ఎక్కువ మంది ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది జనవరి నెలలో 11వ తేదీ ఈ మాస శివరాత్రి వచ్చింది.
జనవరి 13, 2021 : భోగి పండుగ..
ప్రతి సంవత్సరం జనవరి నెలలో భోగి పండుగ వస్తుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి భోగిమంటలు వేస్తారు. అలాగే మహిళలు తమ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వేసి అందంగా ముస్తాబవుతారు. ఈ పండుగను లోహ్రీ పేరిట ఉత్తర భారతంలోనూ ఘనంగా జరుపుకుంటారు.
జనవరి 14, 2021 : మకర సంక్రాంతి..
హిందూ పంచాంగం ప్రకారం, సూర్య భగవానుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి సంచరించనప్పుడు మకర సంక్రాంతి అంటారు. ఈ పవిత్రమైన రోజునే మకర సంక్రాంతి అని అంటారు.
పొంగల్.. జనవరి 14వ తేదీ ఉత్తర భారతదేశంలో మకర సంక్రాంతిని పొంగల్ పేరిట ఉత్సవాలు జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సమయంలో కోడి పందేలు ఎక్కువగా నిర్వహిస్తారు. తమిళనాడు జల్లికట్టు ఉత్సవాలు నిర్వహిస్తారు.
జనవరి 15, 2021 : కనుమ పండుగ..
ఈ పండుగ వ్యవసాయంతో ముడి పడి ఉంటుంది. ఈ సమయంలో రైతుల పంట చేతికొచ్చి ఉంటుంది. అందుకే ఈ పండుగను మూడురోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి తర్వాత కనుమ పండుగ రోజున మాంసాహారం తీసుకుంటారు.
20 జనవరి, 2021 : గురు గోవింద్ సింగ్ జయంతి..
2021 సంవత్సరంలో గురు గోవింద్ సింగ్ జయంతి జనవరి 20న జరుపుకుంటారు. ఈయన శౌర్యం మరియు ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు. గురు గోవింద్ సింగ్ జీ బీహార్లోని పాట్నాలో శుక్ల పక్షంలో ఏడో రోజున జన్మించాడు.
24 జనవరి 2021 : పుత్రదా ఏకాదశి..
చాలా మంది తమకు సంతానం కోసం, పిల్లల శ్రేయస్సు కోసం పుత్రదా ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తుంటారు. ఈ ఏకాదశి, ఈ నెల 24 వ తేదీ అంటే ఆదివారం నాడు వచ్చింది. 25వ తేదీ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను కూడా జరుపుకుంటారు. ఈరోజున యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు.
26 జనవరి 2021 : రిపబ్లిక్ డే..
మన భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమలు చేయబడింది. అందుకే ప్రతి సంవత్సరం 26వ తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల, 18 రోజులు పట్టింది.
28 జనవరి 2021 : పౌర్ణమి..
పౌష్ పౌర్ణమి జనవరి 28న రాబోతోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా శుక్ల పక్షం చివరి తేదీన పౌషా పౌర్ణమి తిథి అని పిలుస్తారు. ఆరోజున ఉపవాసం ఉండటంతో పాటు, పారుతున్న నదిలో స్నానం చేయడం మరియు దాత్రుత్వం చేయడం చాలా ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి.
31 జనవరి 2021 : సంకష్ట చతుర్థి.. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెల క్రిష్ణ పక్షం చతుర్థి రోజున సంకష్ట చతుర్థి ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరుడకి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment