🙏🌹 వివరాలు, ఫలితాలు, పరిహారాలు! 🌹🙏
👉 వివరాలు :
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆశ్వీయుజ మాసం శుక్ల పక్ష పౌర్ణమి శనివారము
అనగా, 28-10-2028 వ తేదీ రాహు గ్రస్త చంద్ర పాక్షిక గ్రహణము అశ్విని నక్షత్రములో సంభవిస్తుంది.
దృక్ సిద్ధాంత గణిత ఆధారముగా గ్రహణ కాలము:
స్పర్శ కాలము - రాత్రి గం. 01:04
మోక్ష కాలము - రాత్రి గం. 2:22
మధ్యకాలము - రాత్రి గం. 01:48
గ్రహణ ఆద్యంతం - గం. 1:18
👉ఈ గ్రహణం అశ్విని నక్షత్రములో ఏర్పడటం వలన మేష రాశి జాతకులు గ్రహణాన్ని చూడకూడదు. భోజనాది కార్యక్రమాలు రాత్రి 9 లోపే పూర్తి చేసుకోవడం మంచిది.
గ్రహణ సమయంలో నిద్రపోకుండా ఉండి జపము, పారాయణం, గ్రహణ దానములు ఆచరించుకోవడం శ్రేయస్కరము.
👉 ఫలితాలు :
గ్రహణ గోచరం ప్రకారం ఈ గ్రహణం కుంభ, వృశ్చిక, కర్కాటక, మిధున రాశులకు
శుభ ఫలితాలను, .మీన, ధనస్సు, తుల, సింహ రాశులకు మధ్యమ ఫలితాలను, మేషం, మకరం, కన్య, వృషభ రాశులకు అశుభ ఫలితాలను ఇచ్చుచున్నది.
👉 పరిహారాలు:
మేషం, మకరం, కన్య, వృషభ రాశుల వ్యక్తులు అశుభ ఫలితాలు తొలగటం కొరకు ఒక కిలో 500 గ్రాములు నల్ల మినుములు, ఒక కిలో 500 గ్రాములు తెల్లని సన్న బియ్యం, ఒక వెండి నాగ పడిగ, ఒక వెండి చంద్ర బింబం, రూ.51/- అంతకన్నా ఎక్కువ మీకు తోచినంత దక్షిణ పెట్టి, మీకు సమీపంలోని శివాలయంలో నిత్య పూజలు చేసే అర్చక స్వాములకు పాదాభివందనం చేసి దానం ఇవ్వండి. ఒక సోమవారం నాడు శివునికి రుద్రాభిషేకం కూడా చేయించవచ్చు.
అన్ని రాశుల వారు గ్రహణం తరువాత వస్తున్న సోమవారం రోజు శివాలయం వెళ్లి, కొబ్బరికాయ, పూలు, అరటిపండ్లు, మీ శక్తి కొద్ది ఇతర పూజ సామాగ్రి సమర్పించి, జాతక బలం కొరకు, శుభ ఫలితాల కొరకు ప్రార్థన చేయండి.
శుభమస్తు 🙏
సర్వే జనా సుఖినోభవంతు 🙏👍
No comments:
Post a Comment